Begin typing your search above and press return to search.

డార్లింగ్ పై సాహో విలన్ ప్రశంశలు

By:  Tupaki Desk   |   7 Aug 2019 7:46 AM GMT
డార్లింగ్ పై సాహో విలన్ ప్రశంశలు
X
ఇంకో 24 రోజులు 24 గంటలంత వేగంగా ఎప్పుడు గడుస్తాయా అని ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సాహో రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ వదులుతున్న పోస్టర్లు మెల్లగా హీట్ ని పెంచుతున్నాయి. బాలీవుడ్ లో సీనియర్ స్టార్ క్యాస్ట్ ఇందులో విలన్లుగా నటించడం పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని తెచ్చిపెడుతోంది. ఇందులో అందరికంటే ఎక్కువ ఆకర్షిస్తున్న వాళ్లలో జాకీ ష్రాఫ్ ఒకరు.

సైడ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్ లో అనిల్ కపూర్ తర్వాత మీసాలు పెట్టుకుని రాణించిన రెండో హీరో జాకీ ఒక్కడే. అప్పట్లో సుభాష్ ఘాయ్ హీరోతో ఇతనికి వచ్చిన గుర్తింపు క్రేజ్ అంతా ఇంతా కాదు. విలన్ గా తెలుగు సినిమాల్లో నటించడం కొత్తేమి కానప్పటికీ సాహో విషయంలో మాత్రం జాకీ ష్రాఫ్ చాలా స్పెషల్ గా ఫీలవుతున్నాడు. సినిమా కన్నా ఎక్కువ డార్లింగ్ ప్రభాస్ గురించిన విశేషాలు చెబుతూ అభిమానులకు కిక్ ఇస్తున్నాడు

ప్రభాస్ గురించి మాట్లాడుతూ డార్లింగ్ పేరులోనే కాదు తీరు కూడా అలాగే ఉంటుందని స్పాట్ లో ఉన్న యాక్టర్స్ తో మొదలుకుని లైట్ బాయ్ దాకా అందరితో ఒకేలా ఉంటడం తనలోనే చూశానని చెప్పిన జాకీ బాహుబలి తర్వాతే ప్రభాస్ లో ఇంకా ఉన్నతమైన వ్యక్తిత్వం చూశానని చెబుతున్నాడు. అంటే విజయ గర్వం తలెకెక్కించుకోకుండా ఇప్పటికీ ఎదిగినా ఒదిగివుండే శైలిని అలవర్చుకోమని అప్ కమింగ్ హీరోలకు చెబుతున్నట్టేగా. రెండు వందల కోట్లకు బడ్జెట్ తో రూపొందిన సాహోలో విలన్ గా నటించడం పట్ల జాకీ ష్రాఫ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు.