Begin typing your search above and press return to search.
కూతురి స్కిన్ షోకి తండ్రి వత్తాసు
By: Tupaki Desk | 1 Dec 2015 4:38 AM GMTఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ హడావిడి ఎక్కువగా ఉంది. టాప్ లెస్ ఫోటోలతో దుమ్ము రేపేస్తోంది. మొదట్లో లైట్ తీసుకున్న మీడియా... ఇప్పుడు జాకీ కూతురు ఓవర్ ఎక్స్ పోజింగ్ ని బాగానే టార్గెట్ చేస్తోంది. రెచ్చిపోతోందంటూ తెగ పబ్లిసిటీ ఇచ్చేస్తోంది. ఇదంతా జాకీ ష్రాఫ్ కి నచ్చడం లేదని టాక్.
ఇంతకీ జాకీ ష్రాఫ్ కి నచ్చనిది కూతురు కృష్ణ చేస్తున్న హడావిడి కాదు. ఈ విషయానికి మీడియా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నచ్చడం లేదట ఈ సీనియర్ హీరోకి. కూతురు ఫోటోషూట్ ని "కూల్ " అంటున్న జాకీ.. అసలు తన కూతురు గొప్పదనం మీకేం తెలుసని ప్రశ్నిస్తున్నాడు. ఓ స్కూల్ లో తన కూతురు బాస్కెట్ బాల్ ట్రైనింగ్ ఇస్తుందని చెప్పాడు. "తను కొందరు ఆడపిల్లలకు బాస్కెట్ బాల్ నేర్పిస్తోంది. ఇప్పుడామె ఓ కోచ్. తను ఇప్పుడు చేస్తున్న పని ఇది. ఇంతకు ముందు కేజీ క్లాసుల పిల్లలు పాఠాలు చెప్పేది. ఇవన్నీ ఎవరూ నన్ను అడగడం లేదు. తన ఫ్రెండ్ ఓ ఫోటోగ్రాఫర్. ఇద్దరూ కలిసి కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. వెరైటీగా ఫోటోషూట్స్ చేస్తున్నారు. అందులో భాగమే ఆ ఫోటోలు. అయినా తను చేసిన మంచి పనుల గురించి మాట్లాడకుండా.. కేవలం ఫోటోలపైనే మాట్లాడ్డం నాకు నచ్చడం లేదు" అంటున్నాడు జాకీష్రాఫ్.
అయినా కృష్ణ హీరోయిన్ అవుతానంటే.. ఎవరూ ఇంతగా పట్టించుకునేవారు కాదన్న విషయం గమనించాలి. అప్పుడు వివాదం అయ్యేది కాదు. కేవలం వాటిలో ఉన్న క్రియేటివిటీ మాత్రమే చూసేవారు. కానీ.. ఈ చిన్నది తను హీరోయిన్ కాబోనంటూ చెప్పింది పలుమార్లు. అందుకే ఇంతరచ్చ. అయినా కూతురుని కంట్రోల్ చేయడం మానేసి.. ఇలా మీడియాపై రంకెలు వేయడం కరెక్టేనంటారా జాకీ భాయ్.