Begin typing your search above and press return to search.
దిశాపటానీతో కొడుకు రిలేషన్ షిప్ గుట్టు విప్పాడు!
By: Tupaki Desk | 29 July 2022 2:30 AM GMTసీకే బ్యూటీ దిశాపటానీ - టైగర్ ష్రాఫ్ మధ్య అసలేం జరుగుతోంది? ఎవరు ప్రశ్నించినా ప్రేమలో లేమని అంటారు. కానీ కలిసే కనిపిస్తారు. ఏ వేదికపై చూసినా జంటగా కనిపిస్తారు. విదేశీ వెకేషన్లకు కలిసే వెళుతుంటారు. డిన్నర్ పార్టీలు లంచ్ డేట్ లు పబ్ షికార్లు అన్నిటికీ జంటగానే కలిసి మెలిసి వెళుతుంటారు. కానీ ఆ ఇద్దరి చెలిమి చూశాక ఎవరికైనా కొన్ని డౌట్లు పుట్టుకొస్తుంటాయి.
ఇంతకీ ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? బ్రేకప్ అయ్యారా? అన్న ప్రశ్నలు తప్పనిసరి. అయితే వాటికి ఇప్పటికీ సమాధానం లేదు. ఈ జంట దాదాపు ఆరు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారని అప్పట్లో కథనాలొచ్చాయి. అయితే వారి మధ్య అసలేం జరిగింది? అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. టైగర్ లేదా దిశా దాని గురించి పెద్దగా ఓపెనవ్వలేదు. తాజాగా ఈ జోడీ బ్రేకప్ పుకార్లపై జాకీ ష్రాఫ్ స్పందించారు.
జాకీ ష్రాఫ్ ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ- ``ఆ ఇద్దరూ (టైగర్ - దిశ) ఎప్పుడూ స్నేహితులు.. ఇప్పటికీ స్నేహితులు. వారు కలిసి బయటకు వెళ్లడం నేను చూశాను. నా కొడుకు లవ్ లైఫ్ ని నేను ట్రాక్ చేయడం కాదు (నవ్వుతూ). నేను వారి గోప్యతకు భంగం కలిగించడం వంటి చివరి పనిని చేయాలనుకుంటున్నాను.
కానీ వారు `చిక్కని స్నేహితుల`ని నేను భావిస్తున్నాను. వారు వృత్తిగతంగానే కాదు.. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు`` అని తెలిపారు. ఇది వారి వ్యక్తిగత జీవితం.. లైఫ్ లో ఎలా ముందుకు వెళ్లాలో వారు నిర్ణయించుకోవాలి అని అన్నారు. ఇది వారి ప్రేమకథ.. నేను నా భార్య (అయేషా) మా ప్రేమకథ మాకు ఉంది. మేము దిశాతో మంచి ఈక్వేషన్ ని కలిగి ఉన్నాము. నేను చెప్పినట్లు వారు కలుసుకోవడం మాట్లాడుకోవడం మొదలైనవాటితో సంతోషంగా ఉన్నారు అని తెలిపారు.
టైగర్ - దిశా పటానీ 2016లో `బెఫిక్రా` అనే మ్యూజిక్ వీడియో కోసం కలిసి పని చేసారు. ఆ వీడియో విడుదలైనప్పటి నుండి ఒకరితో ఒకరు కలిసి ఉన్నారు. లంచ్ డిన్నర్ డేట్ లలో క్రమం తప్పకుండా కనిపిస్తున్నారు. విదేశీ వెకేషన్లకు కలిసి వెళతారు. ఒకరి సోషల్ మీడియా పోస్ట్ లపై మరొకరు అందమైన కామెంట్ లను షేర్ చేస్తుంటారు. ఒకరితో ఒకరు రిలేషన్ షిప్ కలిగి ఉండటాన్ని మాత్రం ఆ ఇద్దరూ తిరస్కరించారు.
ప్రస్తుతానికి జాకీ ష్రాఫ్ చెప్పిన దానిని బట్టి ఆ ఇద్దరినీ స్నేహితులుగానే చూడాలి. ప్రేమికులు కానే కాదు! ఇంతకుముందు `బాఘీ 2`లో కలిసి కనిపించారు. బ్రేకప్ వార్తలు వచ్చాక కూడా టైగర్ నటించిన `బాఘీ 3`లో దిశా ప్రత్యేక గీతంలో కనిపించింది. ఇది స్నేహాన్ని మాత్రమే సూచిస్తుంది.