Begin typing your search above and press return to search.

ఆషిఖి-3 లో ర‌ష్మిక మంద‌న జాక్ పాట్?

By:  Tupaki Desk   |   16 Sep 2022 5:30 AM GMT
ఆషిఖి-3 లో ర‌ష్మిక మంద‌న జాక్ పాట్?
X
ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఆషిఖి - ఆషిఖి 2 యువ‌త‌రాన్ని ఒక ఊపు ఊపిన‌ సంగ‌తి తెలిసిందే. ఆషిఖి 2 లో అద్భుత న‌ట‌న‌కు శ్ర‌ద్ధా క‌పూర్ పేరు మార్మోగింది. ప్ర‌స్తుతం ఆషిఖి 3 చిత్రీక‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో హీరోయిన్ ఎవ‌రో ఆరాలు ఎక్కువ‌య్యాయి. ఇటీవ‌ల‌ బిగ్ బాస్ ఫేం షెహ‌నాజ్ గిల్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. దేశంలోని పాపుల‌ర్ హీరోయిన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న నటి షెహనాజ్ గిల్ నే ఈ ఛాన్స్ వ‌రించింద‌ని ప్ర‌చార‌మైనా ఇంకా క‌థానాయిక ఎవ‌రో ఫిక్స్ కాలేదు. ఇంత‌లోనే ట్యాలెంటెడ్ గాళ్ ర‌ష్మిక మంద‌న పేరు తెర‌పైకొచ్చింది.

ఆషిఖి 3 చిత్రంలో కార్తీక్ అర్య‌న్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. షెహనాజ్ గురించిన ఈ వార్త కొద్దికాలంలోనే హాట్ టాపిక్ గా మారింది. అయితే హీరోయిన్ ను ఇంకా లాక్ చేయ లేద‌ని టి సిరీస్ ప్ర‌తినిధులు వెల్ల‌డించ‌గా ర‌ష్మిక మంద‌న పేరును అభిమానులు సూచిస్తుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ కార్తిక్ ఆర్య‌న్ స‌ర‌స‌న అలాంటి అరుదైన అవ‌కాశం ద‌క్కించుకుంటే ర‌ష్మిక జాక్ పాట్ కొట్టిన‌ట్టే.

ఇంత‌లోనే కార్తిక్ ఆర్యన్ - రష్మిక మందన్న ప్ర‌ముఖ‌ స్కిన్ కేర్ ఉత్ప‌త్తి ప్ర‌క‌ట‌న‌లో న‌టిస్తున్నారు. ట్యాలెంటెడ్ హీరోతో రష్మిక మందన్నకు ఇది మొదటి అవ‌కాశం. అన్నీ కుదిరితే సినిమాలోనూ క‌లిసి న‌టించే వీలుంటుంద‌ని భావిస్తున్నారు. అది ఆషిఖి 3 అయితే బావుంటుంద‌ని ర‌ష్మిక అభిమానులు బ‌లంగా కోరుకుంటున్నారు.

కార్తిక్ ఆర్యన్ భూల్ భూలయ్యా 2 విజయంతో రెట్టించిన దూకుడు చూపిస్తున్నాడు. ఇటీవల రొమాంటిక్ డ్రామా ఆషికి 3కి అత‌డు ఎంపికైన‌ట్టు T-సిరీస్ ప్ర‌క‌టించ‌గానే అభిమానుల్లో ఆనందం వ్య‌క్త‌మైంది.
ఎండార్స్‌మెంట్ ఫ్రంట్ లో యువ‌హీరో చాలా చురుకుగా ఉన్నాడు.

ఇన్ స్టాగ్రామ్ లో కార్తీక్ ఆర్యన్ ఇటీవల షేర్ చేసిన పోస్ట్ లో అతను ర‌ష్మిక‌తో ప్ర‌క‌ట‌న గురించి వెల్ల‌డించాడు. తెలుగు చిత్రం పుష్ప విజయంతో చాలా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నతో ప‌ని చేస్తున్నాన‌ని అత‌డు పోస్ట్ చేశాడు.

అదే క్ర‌మంలో కార్తిక్ - రష్మిక మ‌ధ్య ఇన్ స్టా సంభాష‌ణ‌లు ర‌క్తి క‌ట్టించాయి. సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు ఫాలోవర్లు ఆషిఖీ 3 గురించి కామెంట్ చేస్తున్నారు. ఈ జంటను పెద్ద స్క్రీన్ పై కలిసి చూడాలని తమ కోరికను వ్యక్తం చేశారు. రొమాంటిక్ డ్రామా ఆషిఖీ 3లో న‌టించాల‌ని కోరుకున్నారు. చాలా మంది కార్తిక్ - రష్మిక జంట‌ కెమిస్ట్రీ గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలను షేర్ చేసారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.