Begin typing your search above and press return to search.
గుబులు రేపుతున్న జాకీ జిగిబిగి అందాలు
By: Tupaki Desk | 4 Jun 2022 8:30 AM GMTవివాదాలు ఒక వైపు.. ర్యాంప్ వాక్ లు ఇంకోవైపు.. బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ని నిరంతరం హెడ్ లైన్స్ లోకి తెస్తున్నాయి. లేటెస్టుగా ఓ అవార్డ్ ల వేదికపై నియాన్ కాంతుల జిగిబిగిలో జాక్విలిన్ హొయలు యువతరంలో హాట్ టాపిక్ గా మారాయి.
అబుదబీలో జరుగుతున్న IIFA అవార్డ్స్ 2022లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ లుక్ తో మెస్మరైజ్ చేసింది. సల్మాన్ ఖాన్- షాహిద్ కపూర్- నోరా ఫతేహి- సారా అలీ ఖాన్- అనన్య పాండే తదితరులు ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) కోసం వేసిన గ్రీన్ కార్పెట్ పై నడిచారు. ఈ స్టార్-స్టడెడ్ లైనప్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పైసీ లుక్ తో ప్రత్యక్షమైంది. ఆకుపచ్చ కార్పెట్ పై ఎడ్జీ మెటాలిక్ వన్-షోల్డర్ గౌనులో జాకీ మెరిసిపోయింది. ఇదే వేదికపై కుర్రభామలు సారా అలీ ఖాన్- అనన్య పాండే డిజైనర్ లుక్ లో కనిపించినా కానీ జాకీ లుక్ తో పోలిస్తే తీసికట్టుగా కనిపించారు. మెటాలిక్ మెరుపుల లుక్ తో జాక్విలిన్ చెలరేగింది.
జాక్వెలిన్ వన్ షోల్డర్ మెటాలిక్ గౌనులో ఈ వేదికపై సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. ఆ దుస్తులను వెండి బంగారం రంగుల అద్దకంతో రెండు మెటాలిక్ షేడ్స్ తో రూపొందించారు. ఇది బాడీకాన్ సిల్హౌట్ మోడల్.. థై స్లిట్ లుక్.. భుజంపై కి ఒదిగిన టేప్ లు.. సీక్విన్డ్ అలంకారాలు జాకీలో ఆకర్షణను పెంచాయి. ఈ లుక్ ఇలా రిలీజ్ కాగానే అలా అంతర్జాలంలో ఫ్యాన్స్ లో హుషారు పెరిగింది. అభిమానులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజా లుక్ ని ప్రశంసిస్తూ ఫైర్ ఎమోజీలను షేర్ చేసారు. గుబులు రేపుతున్న జాకీ జిగిబిగి అందాలు కిరాకే అంటూ పొగిడేస్తున్నారు. అయితే కొన్ని నెగెటివ్ కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. స్పైకీ - సీక్విన్డ్ న్యూడ్ బ్యాక్ డ్రాప్ సరికాదంటూ కొందరు తనను ట్రోలింగ్ కూడా చేశారు. ప్రస్తుతం జాకీ కొత్త లుక్ ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
జాకీలో ఆ రెండు కోణాలు..!
జాక్విలిన్ పేరు ఇటీవల వివాదాస్పద అంశాలతో హెడ్ లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పదుడు అయిన బిజినెస్ మేన్ కం మీడియేటర్ సుఖేష్ చంద్రతో జాక్విలిన్ సంబంధాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. కోట్లాది రూపాయల దందా కేసులో సుఖేష్ ని విచారించగా అతడితో జాకీ ఎఫైర్ కహానీ బయటపడింది. అనంతరం సుఖేష్ కానుకగా అందించిన కార్ ని డబ్బుని జాకీ నుంచి ఈడీ లాక్కుంది. ఇక జాకీలో దయా గుణం దానగుణం గురించి కూడా మరో కోణంలో చర్చ సాగింది.
స్వతహాగా శ్రీలంకన్ బ్యూటీ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రతిసారీ శ్రీలంకలో అల్లకల్లోల పరిస్థితులపై ఆవేదన చెందుతూనే ఉంది. తన మాతృభూమిలో ఇటీవలి సంక్షోభ పరిస్థితి గురించి తల్లడిల్లిపోయింది. తిండి తిప్పల్లేక శ్రీలంకన్ ప్రజలు అల్లాడిపోతుంటే గుండె పగిలిపోయిందని వ్యాఖ్యానించింది. శ్రీలంకన్ గా నా దేశం నా దేశప్రజలు ఎలాంటి కష్టం అనుభవిస్తున్నారో చూడటం చాలా హృదయ విదారకంగా ఉందని జాక్వెలిన్ ఆవేదన చెందింది. ఎవరో ఒకరిని దూషించకుండా పరిస్థితిని దారికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. దేశ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తానని తెలిపింది.
జాక్వెలిన్ శ్రీలంక మిస్ యూనివర్స్ గా కిరీటాన్ని గెలుపొంది పదిహేను సంవత్సరాలైంది. 2006లో కిరీటం గెలుచుకుంది. కిరీటం గెలిచిన మూడు సంవత్సరాల తరువాత అంటే 2009లో సినీఎంట్రీ ఇచ్చింది. రితేష్ దేశ్ ముఖ్ `అలాదిన్` తో జాకీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సల్మాన్ ఖాన్ కిక్ తో జాక్వెలిన్ స్టార్ డమ్ ఎదిగింది. ఆమె చివరిసారిగా జాన్ అబ్రహం ఎటాక్ లో కనిపించింది. ఇంతకుముందు ప్రభాస్ సాహోలో స్పెషల్ నంబర్ తో అదరగొట్టి బ్యాడ్ గాళ్ గా తెలుగునాటా పాపులరైంది. హరిహర వీరమల్లులో నటించాల్సి ఉండగా వివాదాల కారణంగా మూవీ నుంచి వైదొలిగిందని కథనాలొచ్చాయి.