Begin typing your search above and press return to search.
హృతిక్ ఆమెకు 5 లక్షల చెక్కు ఇచ్చాడు
By: Tupaki Desk | 26 March 2016 7:35 AM GMTచెన్నై వరదల గురించి అందరూ మరిచిపోయారు కానీ.. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రం ఇంకా అక్కడి జనాల కష్టాల గురించి గుర్తు పెట్టుకుంది. ఈమె శ్రీలంకకు చెందిన అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. కాబట్టి చెన్నై జనాల గురించి బాగానే తెలిసి ఉంటుంది. ఎప్పుడు స్వదేశానికి వెళ్లినా చెన్నై నుంచే వెళ్లాలి మరి. అలా వెళ్లినపుడల్లా చెన్నై పరిస్థితి చూసి చూసి ఆమె హృదయం చలించింది. అందుకే అక్కడి జనాలకు ఏదైనా చేయాలని భావించి.. విరాళాలు సేకరించే పనిలో పడింది జాక్వెలిన్. బాలీవుడ్లో తనకు పరిచయం ఉన్న వాళ్లందరినీ కలిసి చెన్నై వాసుల కోసం విరాళాలు సేకరిస్తోంది జాక్వెలిన్. ఆమెకు హృతిక్ రోషన్ లాంటి పెద్ద హీరో సపోర్ట్ కూడా దొరికింది.
ఇంతకుముందు రామానాయుడు ట్రస్ట్ చెన్నై కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన హృతిక్.. జాక్వెలిన్ చేస్తున్న మంచి పనికి కూడా సపోర్ట్ ఇస్తూ రూ.5 లక్షల చెక్కు ఇచ్చాడట. ఈ సంగతి ట్విట్టర్లో వెల్లడించింది జాక్వెలిన్. తనకు హృతిక్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇదేనంటూ అతడిపై ప్రశంసలు కురిపించింది. హృతిక్ ఇచ్చిన చెక్కు ఫొటోను కూడా షేర్ చేసింది. వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు తిరిగి పక్కా ఇళ్లు కట్టించాలని జాక్వెలిన్ ప్రయత్నిస్తోంది. ఈ చెన్నైకి వచ్చిన జాక్వలిన్.. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, అక్కడ ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. సాధ్యమైనంత ఎక్కువ విరాళాలు సేకరించి.. త్వరలోనే గృహ నిర్మాణాల్ని మొదలుపెట్టాలని చూస్తోంది జాక్వెలిన్. ఆమె ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.