Begin typing your search above and press return to search.
సల్మాన్ పట్ల అంత నమ్మకమట
By: Tupaki Desk | 8 Aug 2015 5:30 AM GMTబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ అంటే అందరికీ అభిమానమే. కత్రిన, జాక్విలిన్ వంటి నాయికలకు మరింత ప్రత్యేకం. బ్రదర్స్ సినిమాలో నటించడం మంచి అనుభవం అని చెప్తూనే ఈ సినిమాలో నటించడం వెనుక జాక్విలిన్ ఓ కథ చెప్పుకొచ్చింది మీరూ ఓ లుక్కేయండి.
సల్మాన్ ఖాన్ అంటే ఈమెకి ఎంత నమ్మకమంటే సల్మాన్ ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుందట. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే బ్రదర్స్ సినిమాలో నటించమని తొలుత దర్శక, నిర్మాతలు ఈమెని సంప్రదిస్తే నో అనేసిందట. చేసేది లేక బోలోమని సల్మాన్ వద్దకు వెళ్లారు. సల్మాన్ చొరవ తీసుకుని జాక్విలిన్ కి ఓ మాట చెప్పాడో లేదో బ్రదర్స్ సినిమాకి సంతకం చేసేసింది. జాకీ ష్రాఫ్ ని బ్రదర్స్ సినిమాలో నటించేందుకు ఒప్పించింది కూడా సల్లూ భాయేనట. సల్మాన్ పై వారికున్న గౌరవం ఎలా వున్నా వీళ్ళ తీరు చూస్తుంటే సల్మాన్ తన సినిమా కథలు వినడం కంటే మిగతా వారి కథలే ఎక్కువ వినాల్సుటుంది.