Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో గుర్రాలకు స్నానం చేయిస్తున్న 'సాహో' బ్యూటీ!

By:  Tupaki Desk   |   2 May 2020 4:40 PM GMT
లాక్ డౌన్ లో గుర్రాలకు స్నానం చేయిస్తున్న సాహో బ్యూటీ!
X
జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌.. అందం అభినయం ఆమె సొంతం. హీరోయిన్‌గా మాత్రమే నటిస్తా అని పట్టుపట్టకుండా చిన్న చిన్న పాత్రలో పాటు.. ఐటమ్‌ సాంగ్స్‌ తోనూ కుర్రకారు మనసు దోచుకుంటోంది ఈ బాలీవుడ్‌ భామ. ‘సాహో’లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ పక్కన ఓ పాటలో మెరిసిన జాక్వలిన్‌ మన సౌత్ ఆడియన్స్ కి కూడా పరిచయమైంది. తాజాగా వెబ్‌ వరల్డ్‌ లోకి కూడా అడుగుపెట్టింది ఈ శ్రీలంకన్ బ్యూటీ. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్ నిర్మించిన ‘మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌’లో మజోజ్ బాజ్ పాయ్ తో కలిసి నటించింది. లాక్ డౌన్ సమయంలో ప్రస్తుతం ముంబయ్‌ లో సల్మాన్‌ ఖాన్‌ కి చెందిన పన్వేల్‌ ఫామ్‌ హౌస్‌లో కొందరు స్నేహితులతో కలసి ఉన్నారీ పొడుగుకాళ్ల సుందరి. ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఎక్కడికీ వెళ్లడానికి లేదు కాబట్టి అక్కడే ఉండిపోయారు.

ఈ నేపథ్యంలో లాక్‌ డౌన్‌ లో లాక్‌ అయిపోయిన జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ మాట్లాడుతూ ‘నా అదృష్టమిది. ఇక్కడి నేచర్‌ చాలా బావుంది. నేను ఎక్కువగా వర్కవుట్స్‌ చేస్తున్నా. గార్డెన్‌లో కూరగాయలతో సలాడ్స్‌ చేస్తున్నా. ప్రతిరోజూ రెండుసార్లు గుర్రపుస్వారీ చేస్తున్నా. రోజు రోజుకీ అందులో ప్రావీణ్యం సాధిస్తున్నా. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్‌! అలాగే, నేను గుర్రాలకు స్నానం చేయిస్తున్నా.. గుర్రపుశాలను శుభ్రం చేస్తున్నా’ అన్నారు. ‘లాక్‌ డౌన్‌ లో ఏం తెలుసుకున్నారు’ అని జాక్వలైన్‌ ని ప్రశ్నించగా ‘మనుషులుగా మనం మన గురించే ఆలోచిస్తాం. రేపు మనం వెళ్లిపోయినా ఎప్పటికీ భూమి ఇలాగే ఉంటుంది’ అన్నారు.

ఇదిలా ఉండగా జాక్వెలిన్ ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న 'ఎటాక్' సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నది. ఈమెతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ముఖ్య పాత్ర చేస్తున్నది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం పూర్తయిన తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కబోయే పీరియాడికల్ మూవీలో నటించబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బాలీవుడ్ లో తన సత్తా చూపిన ఈ హాట్ బ్యూటీ సౌత్ ఇండియాలో కూడా ఈ సినిమాతో పాగా వేస్తుందేమో చూడాలి.