Begin typing your search above and press return to search.
అయ్యో.. ఏ కన్ను పడిందో!!
By: Tupaki Desk | 24 March 2018 5:13 AM GMTప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా దూసుకుపోతోంది. అమ్మడు వెళుతోన్న స్పీడ్ మాములుగా లేదు. మధ్య మధ్యలో కొన్నిం డిజాస్టర్స్ అందుతున్నా కూడా అవకాశాలను చాలా ఈజీగా అందుకుంటోంది. పైగా గ్లామర్ అందాల ఫొటో షూట్స్ కూడా హెల్ప్ అవుతున్నాయి. ఈ శ్రీలంకన్ బ్యూటీకి ఇప్పుడు ఎవరు పోటీ రావడం లేదు. స్టార్ హీరోల సినిమాల్లోని నటించేస్తోంది.
అయితే ఆమె స్పీడ్ పై ఏ కన్ను పడిందో గాని అమ్మడికి కంటికి గాయం అయ్యింది. స్క్వాష్ గేమ్ ఆడుతుండగా ఆమె కన్నుకు దెబ్బ తగిలింది. రక్తం కూడా చాలా పోయిండట. వెంటనే ఆమె సన్నిహితులు హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో జాక్వలిన్ కి చాలా బిజీ షెడ్యూల్ ఉంది. దుబాయ్ లో ప్రస్తుతం రేస్ 3 షూటింగ్ జరుగుతోంది. అందులో ఉండగానే జాక్వలిన్ కి ఇలా గాయమవ్వడం ఇప్పుడు నిర్మాతలకు తలనొప్పిగా మారింది.
షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాక దురదృష్టవశాత్తు జాక్వలిన్ గాయపడింది. ఆమె కోలుకోవడానికి సమయం చాలా పట్టనుందట. దీంతో సల్మాన్ ఖాన్ రేజ్ 3 షూటింగ్ కి బ్రేక్ అయినా పడాలి లేకుంటే మరో షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. రీసెంట్ గా అలియా భట్ కూడా యాక్షన్ కి సంబందించిన సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు ప్రమాదానికి గురైంది. ఆమె కాలుకు తీవ్రంగా దెబ్బ తగలడంతో రెండు మూడు వారల వరకు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పారట.