Begin typing your search above and press return to search.

న‌న్ అవ్వాల‌నుకుని హీరోయిన్ అయ్యింది

By:  Tupaki Desk   |   25 Oct 2015 9:30 AM GMT
న‌న్ అవ్వాల‌నుకుని హీరోయిన్ అయ్యింది
X
డెస్టినీ ఎవ‌రికి ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్ప‌లేం. తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌ల‌చిన చందంగా మ‌నం ఒక‌టి అవ్వాల‌నుకుంటే ఇంకేదో అవుతుంది. ఈ అమ్మ‌డి త‌ల‌రాత కూడా అలానే ఉంది. అస‌లు జీవితంలో కోరిక‌ల‌తో జ్వ‌లించిపోయే పరిస్థితి రాకుండా కేవ‌లం న‌న్‌ గా ఈ శ‌రీరాన్ని చాలించాల‌ని అనుకుంది పాపం. కానీ తానొక‌టి త‌లిస్తే విధి వేరొక‌టి త‌లిచింది. త‌న గ‌మ‌నం ఓ రంగుల ప్ర‌పంచం వైపు సాగింది. అక్క‌డ ఇప్పుడు హీరోయిన్‌ గా కెరీర్ సాగించాల్సొస్తోంది. ఇదంతా ఎవ‌రి గురించి? ఎస్ .. బాలీవుడ్ హాట్ లేడీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ గురించి.

ఈ అమ్మ‌డు స్కూల్ డేస్‌ లోనే న‌న్ అవ్వాల‌ని ఫిక్స్ అయిపోయింది. కానీ అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి. .. 2009లో అలాడిన్ చిత్రంతో అనూహ్యంగా హీరోయిన్ అయిపోయింది. 2014లో కిక్ వ‌ర‌కూ త‌న ప్ర‌మేయం లేకుండానే జ‌ర్నీ సాగిపోయింది. ఇప్ప‌టికీ క్రేజీప్రాజెక్టుల్లో ఛాన్సులున్నాయి. ఈ జీవితాన్ని ఇలానే సాగిపోనీ .. అంటూ కూనిరాగాలు తీస్తోందిప్పుడు. పాపం న‌న్ కావాల్సిన అమ్మ‌డు ప్లే గాళ్‌ గా స్థిర‌ప‌డిపోయింది . అదీ మ్యాట‌రు.