Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరీ: నిద్దుర లేచిన శ్రీలంక అందం

By:  Tupaki Desk   |   12 March 2016 4:14 AM GMT
ఫోటోస్టోరీ: నిద్దుర లేచిన శ్రీలంక అందం
X
సల్మాన్ తో కిక్ మూవీలో చేసిన తర్వాత జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసేస్తున్న ఈ శ్రీలంక సుందరి.. ప్రస్తుతం మూడు బాలీవుడ్ మూవీస్ తో పాటు ఒక ఇంగ్లీష్ ఫిలింలో కూడా నటించేస్తోంది. స్టైలింగ్ విషయంలో ఎప్పుడూ స్పెషాలిటీ చూపించే జాక్వెలిన్.. స్టైల్ మేగజైన్ గా గుర్తింపు పొందిన కాస్మోపాలిటన్ మార్చ్ ఎడిషన్ కవర్ పేజ్ పై ఎక్కేసింది.

పొద్దున్నే నిద్దర లేచినపుడు ఎలా ఉంటుందో దగ్గర నుంచి.. తన రోజు వారి యాక్టివిటీ మొత్తాన్ని ఫోటోల రూపంలో చూపించేసిందీ ఈ సుందరాంగి. ఉదయాన్నే లేవగానే నైట్ వేర్ లోనే ఓ సెల్ఫీతో కనిపించిన జాక్వెలిన్.. అదే డ్రస్ లో ఫోటోతోనే కవర్ పేజ్ పై కనిపిస్తుంది. ఆ తర్వాత ఫుడ్ ఆరగించడంలోకి వెళ్లిపోయింది. పనిలో పనిగా చుట్టూ నాలుగైదు రకాల బ్రాండ్స్ ఫుడ్ ఆర్టికల్స్ సెట్ చేసుకుంది. అటు వాళ్లకి ప్రమోషన్ ఇస్తూనే.. ఇటు తను ఫుడ్ లవర్ అంటూ ఇన్ డైరెక్టుగా చెప్పింది.

మై మియుమియు అంటూ పెంపుడు పిల్లితో దిగిన ఫోటో ఇంకా ఆకట్టుకుంటుంది. పనిలో పనిగా సోషల్ మీడియాపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేసింది. అందంగా ఉండాలని అందరూ కోరుకున్నా.. యాప్ లతో ఫోటోలు మార్ఫింగ్ చేసేయడం కరెక్ట్ కాదన్నది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఇంకా చాలానే చెప్పింది ఈ శ్రీలంక అందం. అవన్నీ చెప్పడం కంటే మేగజైన్ చదువుకోవడం బెటర్ కదా.