Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ప్రియుని కోసం వేచి చూస్తున్నట్టే
By: Tupaki Desk | 21 Sep 2015 10:30 PM GMTహౌస్ ఫుల్ 2 - మర్డర్ 2 - రేస్ 2 .. ఇలా అన్నీ సీక్వెల్స్ లోనే కథానాయికగా నటించింది శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్. అయితే కెరీర్ లో అనుకున్న స్థాయి అందుకోవడానికి చాలా కాలమే వేచి చూడాల్సొచ్చింది. అసలు కెరీర్ టేకఫ్ అవ్వడం లేదు అని బెంగ పెట్టుకున్న టైమ్ ల సల్మాన్ ఖాన్ కిక్ సినమాలో ఛాన్సిచ్చి ఆదుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో ఫిలింమేకర్స్ కళ్లు జాక్విలిన్‌పై పడ్డాయి. ఇటీవలే రిలీజైన బ్రదర్స్ చిత్రంలో నటించింది. డెఫినిషన్ ఆఫ్ ఫియర్, అకార్డింగ్ టు మాథ్యూ సినిమాల్లో నటిస్తోంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి.
ఈ హుషారులోనే లేటెస్టుగా ఈ అమ్మడు .. సినీబ్లిడ్జ్ మ్యాగజైన్ కవర్ పేజీపై తళుక్కుమంది. ఈ ఫోటోషూట్ లో జాకీ మైమరిపించే లుక్ తో ఆకట్టుకుంది. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ మోడల్ గా ఏ రేంజులో మైమరిపించిందో .. ఇప్పుడు అదే రేంజులో ఫోటో షూట్ కోసం అందాల విందు చేసింది. బులుగు రంగు రవికె - నలుపు - తెలుపు చారల డిజైనర్ శారీ .. పక్కా మోడ్రన్ స్టయిల్ లో ధరించి కనిపించింది. బికినీ బీచ్ లో - ఇసుక తిన్నెల్లో ప్రియుని కోసం ఎదురు చూస్తున్న ప్రేయసిలా కనిపిస్తోంది. విరబోసిన ఆ కురులు , వాలు చూపుల్లో మత్తు ఎలాంటి మగాడినైనా చిత్తు చేసేయాల్సిందే. అసలు జాక్విలిన్ లోని ఇలాంటి చురుకైన చూపులు ఇటీవలి కాలంలో చూడనేలేదు. వరుసగా హాలీవుడ్ ప్రొడక్షన్స్ లో నటిస్తోంది. అందుకే ఇలా స్పీడ్ పెంచేసిందేమో!