Begin typing your search above and press return to search.

జ్యూస్ కి కోట్లు పోసిన హీరోయిన్

By:  Tupaki Desk   |   17 April 2017 8:13 AM GMT
జ్యూస్ కి కోట్లు పోసిన హీరోయిన్
X
సినిమా తారలు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి పెట్టుబడులు ఎక్కువయ్యాయి కూడా. అయితే.. చాలామంది ఫ్యాషన్.. స్టైలింగ్.. రెస్టారెంట్స్.. జిమ్ సెంటర్స్ వంటివాటిలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. తొలిసారిగా ఎఫ్ఎంసీజీ విభాగంలో కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేసింది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

కన్జూమర్ విభాగానికి చెందిన రాక్యాన్ బెవరేజెస్ లో జాక్వెలిన్ 3.5 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. గతేడాది 4.5 మిలియన్ డాలర్లను సిరీస్ బి ఫండింగ్ గా పొందిన ఈ స్టార్టప్.. ఇప్పుడు శ్రీలంక అందగత్తె నుంచి పెట్టుబడి అందుకుంది. అయితే.. ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం కావడం విశేషం. జ్యూస్ లను విక్రయించే ఈ కంపెనీ మొత్తం విలువ 120 కోట్లుగా అంచనా వేయగా.. జాక్వెలిన్ కు ప్రస్తుతం మైనారిటీ స్టేక్ మాత్రమే ఉంటుంది. కానీ లాభాల్లో మాత్రం ఎక్కువగానే అందుకుంటుందని అంటున్నారు.

ఇందుకు కారణం.. జాక్వెలిన్ రా ప్రెజరీ బ్రాండ్ ను ప్రమోట్ చేయనుంది కూడా. డైరెక్ట్ మార్కెటింగ్ తో పాటు సోషల్ మీడియాలో తన ఫాలోయర్స్ అయి 13 మిలియన్ల మందిని ప్రభావితం చేయగల పవర్ జాక్వెలిన్ కు ఉంది. అందుకే ఈ జ్యూస్ ల కంపెనీ జాకీకి లాభాల్లో వాటా భారీగానే ముట్టచెప్పనుందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/