Begin typing your search above and press return to search.

హీరోయిన్ తో హగ్ చేయించిన సల్మాన్

By:  Tupaki Desk   |   31 May 2018 5:30 PM GMT
హీరోయిన్ తో హగ్ చేయించిన సల్మాన్
X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంత చలాకీగా కనిపిస్తాడో అందరికి తెలిసిందే. నటీనటులతో సరదాగా గడపాలంటే సల్మాన్ తరువాతే ఎవరైనా. సెట్స్ లోనే కాకుండా వివిధ రకాల పార్టీలలోకి సల్మాన్ వస్తే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. అందుకే బిగ్ బాస్ షో అంతగా హిట్ అయ్యిందని చెప్పవచ్చు. రియాలిటీ షోలలో సల్మాన్ చమత్కారం బాగానే కనిపిస్తుంటుంది. ప్రస్తుతం సల్మాన్ తన రేస్ 3 ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.

ఇకపోతే ఇటీవల ఒక రియాలిటీ షోలో సల్మాన్ పాల్గొన్నాడు. డాన్స్ దివానే అనే ఆ షోలో హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా పాల్గొంది. అయితే ఓ బుడతడు ఆ షోలో తన పెర్ఫెమెన్స్ తో అందరిని ఆకట్టుకొని ప్రశంసలను అందుకున్నాడు. అయితే అక్కడ జాక్వలిన్ ఆ చిన్నోడి మాటలకు ఎట్రాక్ట్ అయిపొయింది. ఇక సల్మాన్ పక్కన నుండి హాగ్ చేసుకో అనే విధంగా చెప్పడంతో ఆ బుడ్డోడు కుదరదని పాయింట్ బ్లాక్ లో తడబడకుండా చెప్పేశాడు.

అది విన్న జాక్వాలిన్ షాక్ అయ్యింది. సల్మాన్ ఇలా కాదు అని దగ్గరికి వెళ్లి జాక్వాలిన్ తో హాగ్ చేయించుకునేలా చేశాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పిల్లాడితో బలవంతంగా అలా చేయిస్తారా అని పలురకాలుగా కామెంట్స్ చేస్తుండడంతో బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పైగా ఆ పిల్లవాడు జాక్వాలిన్ హగ్ చేసుకుంటే ఇబ్బంది పడినట్లు అనిపిస్తోంది అని రకరకాలుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.