Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: దుమ్మురేపుతున్న ట్రైనర్‌

By:  Tupaki Desk   |   10 Oct 2015 5:30 AM GMT
ఫోటో స్టోరి: దుమ్మురేపుతున్న ట్రైనర్‌
X
జిమ్‌ లో కోచింగ్‌ ఇచ్చే ఓ లేడి కోచ్‌ అంటే ఎలా ఉండాలి? అదిగో చూస్తున్నారుగా.. అచ్చం అలా ఉంటే మీకు సరిపోతుందా? మరి మన కోచ్‌ కే సిక్సు ప్యాక్‌ లేకపోతే ఇక మనం మాత్రం ఏం కిక్కుతో ఎక్సర్‌ సైజులు చేస్తాం? అందుకేనేమో తెలివిగా ఆలోచించిన పూమా కంపెనీవారు.. ఇదిగో ఈ శ్రీలంక సుందరినీ కొత్త ట్రైనర్‌ గా రంగంలోకి దించేశారు.

ఆ స్టిల్‌ చూస్తున్నారుగా.. మిస్‌ శ్రీలంక గా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి మన కుర్రాళ్ళ మనస్సులను దోచుకున్న జాక్వెలైన్‌ ఫెర్నాండజ్‌ ఒంపుసొంపులను చూడండి.. వారి నాయనా.. మతిపోవడంలేదూ.. అయితే కేజీల కేజీల వెయిట్‌ ఉండే డంబుల్స్‌ కూడా ఈమె సోకుల సోయగాలను చూస్తే లేచి ఆటోమ్యాటిక్‌ గా డ్యాన్సు వేస్తాయేమో అన్నట్లుంది కదూ ఈమె అవతారం.. ఎంతో టోన్డ్‌ చేసిన యాబ్స్‌ నుండి.. కాకలు తిరిగిన బైసెప్‌ వరకు.. అసలు జాకీ శరీరాకృతి పిచ్చెత్తిస్తోంది అంతే. కిక్‌ సినిమా హిట్టయినా కూడా పెద్దగా ఛాన్సులు రావట్లేదు కాని.. ఇలా యాడ్లలో యువతను హీటెక్కించడానికి మాత్రం అమ్మడు సంబరపడిపోతోంది.

ఇంతకీ ఈ పూమా ఇగ్నయిట్‌ ఎక్స్‌ టీ అంటే ఏంటి? కొంపతీసి జాక్వెలైన్‌ ఏమైనా దగ్గరుండి మరీ ట్రైనింగ్‌ ఇస్తుందా ఏంటి? ఆ అడ్రస్‌ గట్రా చెప్పండి బాబు అనకండీ.. అ. బాగోదు.. మ్యాటర్‌ ఏంటంటే.. మన బంగారం కాళ్ళకేసుకున్న ఆ బూట్లు ఉన్నాయి చూడండి.. మినిమం రేటు 9 వేలు షుమారు ఉందిలే.. వాటి తాలూకు యాడ్‌ ఇదనమాట.. అర్ధమయ్యిందా.. అందాన్ని చూపించేసి కాళ్ళకు తొడిగించేస్తున్నారు.. బూట్లు!!