Begin typing your search above and press return to search.

నిక్క‌రులో జాకీ..చేతిలో పెప్సీ..ఇంకేముంది?

By:  Tupaki Desk   |   16 July 2022 1:30 PM GMT
నిక్క‌రులో జాకీ..చేతిలో పెప్సీ..ఇంకేముంది?
X
శ్రీలంక హాట్ బ్యూటీ జాక్వెలిన్ పెర్నాండేజ్ వైరల్ సెన్సేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. జాకీ ఎప్పుడు ఇన్ స్టాకి ఎక్కినా కుర్రాళ్ల మతులు చెడాల్సిందే. అందంతో అగ్గి రాజేయాల్సిందే. డిజైనర్ దుస్తుల్లో సొగ‌స‌రి మెరుపుల సంచలనాలు కొనసాగాల్సిందే. ఆన్ ది స్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్ర్కీన్ అయినా జాకీ హాట్ దెబ్బకి యువ‌త విల‌విల‌లాడిల్సిందే.

జాకీ మైకంలో ప‌డిన త‌ర్వాత త‌ప్ప‌క ఈదాల్సిందే. ఆ స్థాయిలో ఫేమ‌స్ అయింది కాబ‌ట్టే జాకీ పేరెత్తితే ఓ వైబ్ క్రియేట్ అవుతుంది. కేవ‌లం వారసత్వ పరిశ్రమలో తనను తాను నిలబెట్టుకునేందుకే జాకీ ఇలాంటి టెంప్టింగ్ సాహసాలకు ఎప్ప‌టిక‌ప్పుడు పూనుకుంటుంది. ఫ్యాన్స్ లో తనకు ఏమాత్రం క్రేజు తగ్గకుండా జాగ్రత్త పడుతుంది. రెగ్యులర్ గా క్యాలెండర్ షూట్లతో వేడి పెంచుతూనే ఉంటుంది.

జిమ్ లో రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా కనిపిస్తుంది. వాటిలో ప్రెష్ పీల్ ని అందించ‌డానికి నిరంత‌రం త‌పిస్తుంటుంది. తాజాగా జాకీ కొత్త ఫోటో ఒక‌టి ఇన్ స్టాని షేక్ చేస్తుంది. ఇదిగో ఇక్క‌డిలో డెనిమ్ జీన్స్ నిక్క‌రులో థైం అందాలు ఎలివేట్ చేస్తూ యువ‌త‌లో అగ్గిరేస్తుంది. జీన్స్ మ్యాచింగ్ వైట్ క‌ల‌ర్ బ‌నియ‌న్ లో జాకీ హీట్ పెంచుతుంది.

చేతిలో జీరో షుగ‌ర్ పెప్సీ టిన్ తో అమ్మ‌డు క్యామ్ కి ఫోజులిచ్చింది. బ్లాక్ పెప్సీ యాడ్ కోసం జాకీ ఇలా ముస్తాబై క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు హాట్ కామెంట్ల‌తో ఎటికింగ్ దిగుతున్నారు.

ఇక జాక్వెలిన్ కెరీర్ సంగ‌తి చూస్తే ప్ర‌స్తుతం న‌టిగా బిజీగా ఉంది. బాలీవుడ్ లో 'సిర్క‌స్'..'రామ‌సేతు' చిత్రాల్లో న‌టిస్తోంది. 'విక్రాంత్ రోణా' సినిమాలో స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ ఇస్తుంది. ఇటీవ‌లే 'బ‌చ్చ‌న్ పాండే'..'ఎటాక్' సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన రెండు సినిమాలు వాటిని అందుకోవడంలో విఫ‌ల‌మ‌య్యాయి.

అలాగే జాకీ మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటోన్న సంగ‌తి తెలిసిందే. ఆ కార‌ణంగా కొన్ని అవ‌కాశాలు సైతం కోల్పోయింది. తెలుగు సినిమా 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' లో ఎంపికైంది. కానీ మ‌నీలాండ‌రింగ్ కేసు కార‌ణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది.