Begin typing your search above and press return to search.
పంథ్ కి పోటీగా జడేజా.. ఊర్వశి నామస్మరణం!
By: Tupaki Desk | 20 April 2023 7:00 AM GMTహేట్ స్టోరి 4 బ్యూటీ ఊర్వశి రౌతేలా అందాలకు క్లీన్ బౌల్డ్ కానిది ఎవరు? ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లు ఇప్పటికే ఒక్కొక్కరుగా స్టంప్ అవుట్ అయిపోతున్నారు. ఇటీవల ఊర్వశి లవర్ అంటూ రిషబ్ పంత్ పేరు ప్రముఖంగా వినిపించింది. అతడు ఊర్వశి పిలుపు కోసం ఐదు నక్షత్రాల హోటల్ లాంజ్ లో గంటల కొద్దీ సమయం వెచ్చించాడని కథనాలొచ్చాయి. అనంతరం ఊర్వశి ప్రకటనతో పంథ్ గందరగోళంలో పడ్డాడు.
అయితే అభిమానులు మాత్రం ఈ జంట ఎంతో బావుంటుందని కితాబిచ్చేశారు. ఆ తర్వాత మరో యువక్రికెటర్ నసీమ్ షా కూడా ఊర్వశి అందచందాలకు క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఇంకా ఊర్వశి జాబితాలో పలువురి పేర్లు చేరుతూనే ఉన్నాయి. క్రికెటర్లకు ఊర్వశి పేరును లింకప్ చేయడంతో సోషల్ మీడియాలో తరచుగా చర్చనీయాంశమైంది.
తాజాగా ఊర్వశి అందాలకు పడిపోయిన వారి జాబితాలోకి మరో క్రికెటర్ చేరిపోయాడు. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక న్యూస్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశిపై తన అభిమానాన్ని దాచుకోలేకపోయాడు. అతడి వ్యాఖ్యలు అప్పటి నుండి సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. బాలీవుడ్ నటీమణుల్లో ఎవరు సెక్సీ? అని హోస్ట్ అడిగినప్పుడు.. జడేజా వెంటనే ఊర్వశి రౌతేలా పేరును ప్రస్తావించాడు. ఈ ప్రకటన ఊర్వశికి క్రికెటర్లలో పెరుగుతున్న క్రేజ్ ను మరింత పెంచింది.
రిషబ్ పంత్ వర్సెస్ ఊర్వశి రౌతేలా వివాదం ఇప్పటికీ ముగిసిపోలేదు. పంథ్ ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో చేరినప్పటికీ 5 జనవరి 2023న ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ కి ఊర్వశి చేరుకున్నప్పటి ఫోటోలు వైరల్ అయ్యాయి. అక్కడ పంత్ గాయానికి చికిత్స పొందుతుండగా తాను ఎందుకు చేరుకుంది? అంటూ ప్రశ్న తలెత్తింది. రౌతేలా దానిపై ఎలాంటి నిర్దిష్ట వివరాలను ప్రస్తావించకపోయినా.. క్రికెటర్ కోసమే ఆస్పత్రికి వచ్చిందన సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. కానీ ఊర్వశి వ్యవహారంపై పంథ్ అభిమానులు మాత్రం సీరియస్ గా స్పందిస్తున్నారు. వరుసగా యువక్రికెటర్లు ఊర్వశి వల్లో పడిపోవడం కొంత కంగారు పెట్టే వ్యవహారమే.