Begin typing your search above and press return to search.
సినిమా రివ్యూ : జాదూగాడు
By: Tupaki Desk | 26 Jun 2015 11:31 AM GMTరివ్యూ: జాదూగాడు
రేటింగ్: 2.5 /5
తారాగణం: నాగశౌర్య, సోనారిక, కోట శ్రీనివాసరావు, జాకీర్ హుస్సేన్, శ్రీనివాసరెడ్డి, రవికాలె, ఆశిష్‌విద్యార్థి, సప్తగిరి తదితరులు
ఎడిటింగ్: ఎమ్‌ఆర్ వర్మ
సంగీతం: సాగర్ మహతి
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
నిర్మాత: వీవీఎన్ ప్రసాద్
దర్శకత్వం: యోగేష్
'ఊహలు గుసగుసలాడె' 'దిక్కులుచూడకు రామయ్య' వంటి సాఫ్ట్ సినిమాలతో దగ్గర అయ్యి.. అలాంటి సబ్జెక్టులకు చక్కగా అమరుతాడనిపించుకొన్న నాగశౌర్య 'జాదూగాడు' అనే మాస్ సినిమాతో వస్తున్నాడంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. క్లాస్‌తో కనెక్టివిటీ ఏర్పడిన ఈ కుర్రాడికి ఏమైంది అనుకొన్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లు చేసుకొకుండా... ఎందుకీ తాపత్రయం అనే అభిప్రాయాలు వినిపించాయి. ట్రైలర్‌తోనే ఈ సినిమాకూ క్లాస్ ప్రేక్షకులకు మధ్య కనెక్షన్ మిస్ అయ్యింది. మరి మాస్‌ను అలరించాలనే యత్నం ఆ వర్గం ప్రేక్షకులనైనా కచ్చితంగా అలరించాల్సిందే! లేకపోతే.. అటూ ఇటూ కాకుండా పోతుంది. మరి ఈ విషయంలో ఎంత మేరకు విజయం సాధించిందో చూద్దాం.
కథ:
ఎలాగైనా కోటీశ్వరుడిని అయిపోవాలని కలలు కంటూ పాలమూరు నుంచి హైదరాబాద్ వచ్చిన కుర్రాడు కృష్ణ(నాగశౌర్య). ఒక బ్యాంక్‌కు అప్పుల రికవరీ ఏజెంట్‌గా చేరతాడు. బ్యాంకులకు డబ్బును వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసేసి.. డబ్బులు ఇవ్వాల్సిన రౌడీలు, గూండాల్లాంటి వారి నుంచి తను వసూలు చేసుకోవడం మొదలుపెడతాడు. ఈ ప్రయత్నంలో మొదటగా రౌడీల చేతిల్లో దెబ్బలుతిన్నా... తెగించి ముందుకు వెళ్లడంతో డబ్బులు వసూలు కావడంతో పాటు కొత్త పరిచయాలు కలుగుతాయి. ఈ జాదూగాడు శ్రీశైలం(జాకీర్ హుస్సేన్) అనే ఒక డాన్ వద్ద పనికి కుదరతాడు. పెద్ద పరపతి ఉన్న శ్రీశైలం కృష్ణని తన బినామీగా మారుస్తాడు. హీరోని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొనే ప్రణాళిక వేసి చివరగా తనని అంతమొందించే ప్రణాళిక వేస్తాడు. ఇది తెలియక ఈ ఉచ్చులో చిక్కుకుపోయిన కృష్ణ ఎలా బయటపడ్డాడు.. డబ్బు సంపాదించాలనే కలను ఎలా నెరవేర్చుకొన్నాడు.. అనేది మిగతా కథ. దీనికి ఉప కథలుగా హీరో లవ్‌స్టోరీ, శ్రీశైలం అండ్ గ్యాంగ్‌ను వేటాడే పోలీసుల కథలు ఉంటాయి.
కథనం, విశ్లేషణ:
ఎలాగూ మల్టీప్లెక్స్ ఆడియన్స్‌తో థ్రెడ్ తెగింది.. మనం తెగించకపోతే బాగుండదన్నట్టుగా దర్శకుడు, హీరోలు పూర్తిగా మాస్ బాట పట్టారు. హీరో చేత గడ్డం పెంచించారు.. దర్శకుడు గడ్డంగ్యాంగ్ లపైనే ఫోకస్ పెట్టాడు. చిత్రం ఏమిటంటే ఇదే దర్శకుడు కొన్ని సంవత్సరాల కిందట 'చింతకాయల రవి' అనే క్లాస్ లవ్‌స్టోరీని రూపొందించాడు. అది సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ ప్రయత్నం చేశాడు. హీరో ఇంట్రడక్షన్ నుంచి అతడి కలలు, వాటిని నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలను కొంచెం కొత్తగానే చూపాడు దర్శకుడు. చాలా కసరత్తు చేసి రాసుకొన్న కథనంతో తొలి సగం పూర్తయ్యేవరకూ సినిమా పకడ్బందీగానే సాగుతుంది.
అయితే రెండోసగం స్టార్ట్ అయ్యాకే గందరగోళం మొదలవుతుంది. అది క్లైమాక్స్‌తో కానీ ఒక కొలిక్కిరాదు. దీంతో ఫస్టాఫ్‌కు ఫుల్ మార్క్స్ పడినా రెండో సగం తేలిపోవడంతో సినిమాకు ఓవరాల్ మార్క్స్ తగ్గిపోతాయి. ఎండింగ్‌లో ఇచ్చే ట్విస్టులు ఊహించగలిగినవే అయినా కొంత వరకూ ఇవి ప్రేక్షకుడిని సర్‌ప్రైజ్ చేయగలవు. దర్శకుడు వీలైనన్ని ఎక్కువ పాత్రలను కథలో ఇన్‌వాల్వ్ చేయడానికి ప్రయత్నించాడు. అలా సృష్టించిన పాత్రలను ఎక్కడిక్కడ వదిలేసుకొంటూ పోయాడు. ఫస్టాఫ్‌లో హీరోకు సన్నిహితులుగా కనిపించే కమేడియన్ల పాత్రలు ఇంటర్వెల్ తర్వాత మళ్లీ కనిపించవ్! కామెడీ సీన్లు అయిపోయాయి.. ఇక వారి అవసరం తీరిందన్నట్టుగా ఆ పాత్రలను పక్కనపెట్టేశారు. ఇక సినిమా ఊపందుకోవాల్సిన పతాక సన్నివేశాల్లో సప్తగిరి క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసి, హాస్యం అనే అపహాస్యాన్ని చేశాడు. ఇలాంటి అర్థంలేని పాత్రలు వచ్చి పోతూ ఉంటాయి.
అలాగే పోలిస్ కమిషనర్‌గా అశిష్ విద్యార్థి పాత్రకు బిల్డప్ ఇచ్చినా అదీ ఒక ఒడ్డుకు చేరకుండానే కొట్టుకుపోతుంది. మరి ఇలా సినిమాలోకి ఇన్‌వాల్వ్ కాని క్యారెక్టర్లతో కథనాన్ని నడిపించాడు. ఇన్‌వాల్వ్ అయిన క్యారెక్టర్లది అనవసరమైన జోక్యం అనిపిస్తుంది. కథ, కథనాల్లో ఎక్కడా లాజిక్‌లు ఉండవు. ఆశించడం కూడా సబబు కాదేమో! అభినందించదగిన అంశం ఏమిటంటే.. ఏదో మాస్ ప్రయత్నం చేయాలని కథను సృష్టించుకోలేదు. సినిమా కచ్చితంగా మాస్ సబ్జెక్టే. అయితే మెరుగులుదిద్దుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. అదే జరిగి ఉంటే జాదుగాడు మరింతగా మెరిసేవాడు. హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లను కూడా బాగా సెట్ చేసుకొన్నాడు దర్శకుడు. వాటిలో హీరోహీరోయిన్లిద్దరూ లీనమై పండించారు.
నటీనటులు:
ఈ సినిమాకు నాగశౌర్య కరెక్టుగా సెట్ అయ్యాడు. అతడి మాస్ ప్రయత్నాలకు సూటయ్యే సబ్జెక్ట్ ఇది. ఈ కథకు పక్కా మాస్ ఇమేజ్ ఉన్న హీరో సెట్ కాడు. తొలి ప్రయత్నాలు చేసే వారికే ఇది సబబైన సబ్జెక్ట్. తన పాత్రను ఈ కుర్రహీరో పండించారు. హీరోయిన్‌కు కూడా కొంచెం ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత కన్నా తన అందాలను చూపడంతోనే సోనారిక గుర్తుండిపోతుంది. ఇక రవికాలె, జాకీర్‌హుస్సేన్ పాత్రలకు పూర్తి నిడివితో కొనసాగుతాయి. వాటిని లీడ్ చేయడం ఈ అనుభవజ్ఞులకు ఏ మాత్రం కష్టం కాలేదు. కోట ఫోన్ల నుంచి ఆదేశాలు ఇచ్చే ముసలి విలన్ పాత్రను చేశాడు. ఇక శ్రీనివాసరెడ్డి, పృథ్వి వంటి వాళ్లు తమకున్న రెండు మూడు సీన్లను తమదైన శైలిలో లీడ్ చేశారు. సప్తగిరికి వయాగ్రా వేయించి వల్గర్ కామెడీ చేయించడం ఎందుకో అర్థం కాదు.
సాంకేతిక వర్గం:
ఈ విభాగంలో ప్రస్తావించుకోవాల్సింది సాగర్ మహతిని. సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు అయిన మహతి సినిమాకు మంచి సంగీతం ఇచ్చాడు. రెండు మెలొడీలు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటాయి. వాటి చిత్రీకరణ కూడా చక్కగా ఉండటం సినిమాకే ప్లస్ పాయింట్. ఈ విషయంలో సినిమాటోగ్రఫర్, దర్శకుల కో ఆర్డినేషన్ బాగుందనుకోవాలి. సినిమా నిడివి రెండున్నర గంటల్లోపే ఉన్నా ఇంకో పదిహేను నిమిషాల నిడివిని తగ్గించి ఉన్నా ఏ మాత్రం నష్టం ఉండేది కాదు. దర్శకుడు యోగి అలియాస్ యోగేష్ గురించి మాట్లాడుకోవాలంటే.. ఇతడి గత సినిమా 'చింతకాయలరవి' థియేటర్లలో ఆడలేదు కానీ.. చానళ్లలో ప్రసారం అవుతూ టీవీల్లో మాత్రం బాగా ఆడుతోంది. జాదూగాడులో కూడా అలాంటి కంటెంటే కనిపిస్తోంది. కాబట్టి ఇక ఇది జనాల్ని ఏ మేరకు థియేటర్లకు రప్పిస్తుందన్నే బట్టే ఈ దర్శకుడి పనితనానికి ఫలితాన్ని నిర్దేశించనుంది.
చివరిగా...
బోర్ కొట్టించడు కానీ.. మరీ అంత జాదూ కూడా చేయలేని జాదూగాడు!