Begin typing your search above and press return to search.
అల్లు శిరీష్ కోసం ఎన్టీఆర్ టైటిల్??
By: Tupaki Desk | 29 July 2016 11:30 AM GMTఒకప్పుడు కొందరు స్టార్ హీరోలు.. సేమ తమ కుటుంబానికి చెందిన హీరోల పాత సినిమా టైటిళ్ళనే వారు తిరిగి వాడుకున్నారు. కాని కాలం మారింది. ఇప్పటి తరం హీరోలెవ్వరూ అలా థింక్ చేయట్లేదు. ఇప్పుడందరూ నచ్చితే ఎవరి టైటిల్ అయినా వాడేస్తున్నారు. అక్కినేని ''శ్రీమంతుడు'' టైటిల్ మహేష్ వాడుకున్నాడు. బృందావనం సినిమా ట్యాగ్ లైన్ ''గోవిందుడు అందరివాడేలే''.. ఏకంగా రామ్ చరణ్ టైటిల్ గా పెట్టుకున్నాడు. వీరి బాటలోనే నడుస్తున్నాడు యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా.
''శ్రీరస్తు శుభమస్తు'' సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అల్లు శిరీష్.. తదుపరి మల్లిడి వేణు అనే కొత్త కుర్రాడు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సర్వం సిద్దం చేసుకున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా ముగిసిందట. బాగా ఆలోచించి ఈ సినిమాకు ''జగదేక వీరుని కథ'' అనే టైటిల్ ను పెట్టినట్లు తెలుస్తోంది. ఇది పెద్ద ఎన్టీఆర్ సినిమా పేరు అని వేరే చెప్పక్కర్లేదుగా. అప్పట్లో ఒక మైథలాజికల్ సినిమాకు వాడిన ఆ టైటిల్ ఇప్పుడు శిరీష్ సినిమాకు ఎలా సూటవుతుందో తెలియదు కాని.. ఈ సినిమాలో మన యంగ్ మెగా హీరో మాత్రం రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్నాడట.
ఇకపోతే 1961లో కె.వి.రెడ్డి గారి డైరక్షన్లో వచ్చిన సినిమా ''జగదేక వీరుని కథ''. ఈ సినిమాలోని ఒక పాటలో ఎన్టీఆర్ ఏకంగా ఐదు పాత్రల్లో కనిపిస్తారు. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అనే టెక్నాలజీయే లేనప్పుడు.. అలా ఐదు పాత్రలు చూపించడం అనేది దర్శకుడు కెవి రెడ్డికే చెల్లింది. అందుకే ఆ సినిమా బాగా ఫేమస్. అప్పటికే పాతాళభైరవి, మాయాబజార్ వంటి సినిమాలను తీసిన ఈ దర్శకుడికి జగదేక వీరుని కథ తీయడం పెద్ద విషయమేం కాదులే.