Begin typing your search above and press return to search.
#హ్యాట్సాఫ్ టు ధనుష్ .. అవెంజర్స్ దర్శకుల మనసు దోచిన గ్రేట్ స్టార్!
By: Tupaki Desk | 18 Jun 2021 4:02 AM GMTకోలీవుడ్ సూపర్ స్టార్ గా ధనుష్ అజేయమైన ట్రాక్ రికార్డ్ గురించి తెలిసిందే. జాతీయ ఉత్తమ నటుడిగా అతడికి ఉన్న ఫాలోయింగ్ అసాధారణం. రాంజానా చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోనూ తనదైన ఫాలోయింగ్ ని సంపాదించిన ధనుష్ తదుపరి హాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నాడు.
అవెంజర్స్ దర్శకులు జో రస్పో - ఆంథోని రస్సో ద్వయం తెరకెక్కిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం `ది గ్రే మ్యాన్` లో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఒక నవల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇక ఈ మూవీ కంటే ముందే తమ హీరో నటించిన `జగమే తందిరమ్` విడుదలపై అవెంజర్స్ ఎండ్ గేమ్ దర్శకులు తమిళంలో ధనుష్ కి విషెస్ చెప్పడం ఆశ్చర్యపరిచింది.
ధనుష్ నటిస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా జగమే తంత్రం (జగమే తందిరమ్) నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శశికాంత్ నిర్మాత. దాదాపు 17 భాషలలో 190 దేశాలలో విడుదల కానుంది.
తాజాగా జో రుస్సో- ఆంథోనీ రస్సో ట్విట్టర్ లో ధనుష్ కి తమిళంలో శుభాకాంక్షలు తెలిపారు. ``సూపర్ డా తంబి! ధనుష్ కె రాజాతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. బెస్టాఫ్ లక్ # జగమే తందిరం`` అని రస్సో బ్రదర్స్ ట్వీట్ చేశారు. ధనుష్ దానికి ఎంతో వినయంగా రీట్వీట్ చేస్తూ..``ఇంత ఆనందం నాది సార్. చాలా ధన్యవాదాలు. మీరు చాలా స్వీట్`` అని రిప్లయ్ ఇచ్చారు. ఈ సంభాషణ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
ధనుష్ అభిమానులంతా గర్వించదగిన అరుదైన సందర్భమిది. ప్రపంచంలోనే బిలియన్ డాలర్ వసూళ్లతో సంచలన సినిమాలు తీసిన లెజెండరీ హాలీవుడ్ దర్శకులు ధనుష్ పై అభిమానం కురిపించడం అతడి సినిమా విజయం సాధించాలని కోరడం నిజంగా ఆశ్చర్యపరిచేదే. ఇలాంటి అరుదైన సందర్భం ఇతర హీరోలకు అంత సులువుగా దక్కేది కాదు.