Begin typing your search above and press return to search.

'జగమే తంతిరమ్' టీజర్: 'గ్యాంగ్ స్టర్ సురులి'గా అలరిస్తున్న ధనుష్..!

By:  Tupaki Desk   |   22 Feb 2021 1:48 PM IST
జగమే తంతిరమ్ టీజర్: గ్యాంగ్ స్టర్ సురులిగా అలరిస్తున్న ధనుష్..!
X
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో రూపొందిన ‘జగమే తంతిరమ్’ సినిమా విడుదల వేదికపై క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లూ థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూసిన మేకర్స్.. చివరకు ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేయడానికి నిర్ణయుంచుకున్నారు. ఇది ధనుష్ కెరీర్ లో 40వ సినిమాగా రూపొందింది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ''జగమే తంత్రం'' అనే టైటిల్ తో రాబోతోంది. తాజాగా 'జగమే తంతిరమ్' చిత్ర టీజర్ ని నెట్ ఫ్లిక్స్ వారు విడుదల చేశారు.

టీజర్ లో ధనుష్ ని సురులి అనే ప్రమాదకరమైన గ్యాంగ్ స్టర్ గా ఇంట్రడ్యూస్ చేశారు. గ్యాంగ్ స్టర్ అయినప్పటికీ అతని బిహేవియర్ చూస్తే ఫన్నీ మ్యాన్ అని అర్థం అవుతోంది. సురలి విదేశాలకు వెళ్లి అక్కడి గ్యాంగ్ స్టర్స్ తో డీల్ పెట్టుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఇందులో చూపించారు. ధనుష్ ఎప్పటిలాగే తనదైన శైలి స్క్రీన్ ప్రెజన్స్ మరియు డ్యాన్స్ తో అలరించాడు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. 'జగమే తంతిరమ్' సినిమాని నెట్ ఫ్లిక్స్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.