Begin typing your search above and press return to search.
'జగమే తంత్రం' ట్రైలర్: లండన్ వీధుల్లో గ్యాంగ్ స్టర్ సురలి బీభత్సం..!
By: Tupaki Desk | 1 Jun 2021 10:38 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘జగమే తంతిరమ్’. ధనుష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో ''జగమే తంత్రం'' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూసిన మేకర్స్.. చివరకు కోవిడ్ నేపథ్యంలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'నెట్ ఫ్లిక్స్' లో జూన్ 18న ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేయబడిన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'జగమే తంత్రం' తెలుగు ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ట్రైలర్ లో ధనుష్ ని తమిళనాడుకు చెందిన 'సురులి' అనే ప్రమాదకరమైన గ్యాంగ్ స్టర్ గా చూపించారు. లండన్ లో అక్రమ ఆయుధాలు మరియు బంగారు వ్యాపారాన్ని నియంత్రించడానికి అక్కడి పొలిటికల్ లీడర్ ఒకరు సురలి ని నియమించుకుంటాడు. సురలి విదేశాలకు వెళ్లి అక్కడి గ్యాంగ్ స్టర్స్ తో వైరం పెట్టుకున్న తర్వాత అతను ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనేది ఇందులో చూపించారు. ధనుష్ ఇందులో డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఎప్పటిలాగే తనదైన శైలి స్క్రీన్ ప్రెజన్స్ తో యాక్షన్ తో అదరగొట్టాడు. ఈ యాక్షన్ పాకెడ్ ట్రైలర్ వీక్షకులను అలరిస్తోంది.
ఇందులో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. జేమ్స్ కాస్మో - కలై యారసన్ - జోజు జార్జ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ కార్తీక్ సుబ్బారాజు - ధనుష్ కలిసి కొత్త కథాంశంతో వస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించగా వివేక్ హర్షన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ 'జగమే తంత్రం' చిత్రాన్ని నిర్మించారు.