Begin typing your search above and press return to search.

నేనున్నాను నేను విన్నాను.. డైలాగ్ వెన‌క‌..!

By:  Tupaki Desk   |   7 May 2022 5:30 AM GMT
నేనున్నాను నేను విన్నాను.. డైలాగ్ వెన‌క‌..!
X
సూప‌ర్ స్టార్ మహేష్ - కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన‌ 'సర్కారు వారి పాట' ఈనెల 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఇంత‌కుముందే ట్రైల‌ర్ విడుదలై దూసుకెళ్లింది. ట్రైలర్ విడుదలై ఆక‌ట్టుకుంది. ల‌వ్ రొమాన్స్ యాక్ష‌న్ తో ప్యాక్డ్ సినిమా ఇద‌న్న చ‌ర్చా సాగింది. అయితే దీనికి మించి ''నేనున్నాను.. నేను విన్నాను'' అనే డైలాగ్ గురించి డిబేట్ మొద‌లైంది.

ఈ డైలాగ్ ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కాపీ చేసార‌ని చాలామందికి తెలిసినా.. ఆ డైలాగ్ మహేశ్ బాబుపై.. దర్శకుడు పరశురాంపై వైఎస్ జగన్ ప్రభావం తప్ప వేరొక కార‌ణం ఏదీ లేద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఇదే విష‌య‌మై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రులు మాటా మంతీ సంద‌ర్భంలో గుర్తు చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఇది నిజ‌మేనా? అని ప‌ర‌శురామ్ నే అడిగితే.. అత‌డు చెప్పిన ఆన్స‌ర్ ఇలా ఉంది. సమైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న ప్రేమ వల్లే ఈ డైలాగ్ ఉంచినట్లు స్పష్టం చేశారు. తాను వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఫాలోవ‌ర్ ని అని ఆయ‌న‌ డైలాగ్ ని నిజంగా ఇష్టపడ్డానని దర్శకుడు ప‌ర‌శురామ్ వెల్లడించాడు.

మహేష్ - కీర్తి మధ్య ఓ స‌న్నివేశంలో దానిని ఉపయోగించాలని అనుకోవ‌డానికి వైయ‌స్ పై అభిమాన‌మే కార‌ణ‌మ‌ని తెలిపారు. ఆ కీల‌క స‌న్నివేశంలో హీరో గారు.. కీర్తికి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఈ డైలాగ్ చెబుతారు. ఆ డైలాగ్ ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ను లేదా ఆయన ప్రభుత్వాన్ని మెప్పించడానికి రాయలేదని నిజానికి దివంగత వైఎస్‌ఆర్ కు నివాళులర్పిస్తూ రాసుకున్నార‌ని ఇప్పుడు అంతా భావించాల్సి ఉంటుంది. మ‌హేష్ తో కీర్తి రొమాన్స్ అద్భుతంగా పండింద‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. రొమాన్స్ తో పాటు యాక్ష‌న్ ని కూడా అంతే ఆస‌క్తిక‌రంగా యాడ‌ప్ చేసారు ప‌ర‌శురామ్. ఇందులో కీర్తి న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటోంది. అయితే మ‌హేష్ - కీర్తి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశానికి వైయ‌స్ డైలాగ్ ని ఉప‌యోగించారు గ‌నుక థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.

ప్రీమియ‌ర్ల నుంచే బ్రేక్ ఈవెన్‌?ఇంటా బ‌య‌టా స‌ర్కార్ వారి పాట‌ ప్రీరిలీజ్ బిజినెస్ గురించి చ‌ర్చ‌ సాగుతోంది. భారీ మొత్తాల‌కు బ‌య్య‌ర్లు రైట్స్ ని కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక అమెరికా లాంటి చోట మ‌హేష్ కి ఉన్న అరుదైన రికార్డ్ గురించి తెలిసిందే. మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో అత‌డి సినిమాలెన్నో ఉన్నాయి. మూవీ క‌నెక్ట‌యితే తెలుగు రాష్ట్రాలు ఒకెత్తు అనుకుంటే.. కేవ‌లం అమెరికా నుంచే సునాయాసంగా 20కోట్లు పైగా తేగ‌లిగే స‌మ‌ర్థ‌త మ‌హేష్ కి ఉంది.

అందుకే ఇప్పుడు రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతున్న స‌ర్కార్ వారి పాట పైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఆస‌క్తిక‌రంగా అమెరికాలో SVP పంపిణీ వ‌ర్గాలు ప్రీమియ‌ర్ల‌తోనే సేఫ్ అవ్వాల‌ని ప్లాన్ చేసార‌ని తెలిసింది. పెట్టిన పెట్టుబ‌డి మొత్తాన్ని ప్రీమియ‌ర్ల నుంచే రాబ‌ట్టాల‌ని బ్రేక్ ఈవెన్ సాధించాల‌ని అమెరికా బ‌య్య‌ర్లు గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే అమెరికాలో ఎస్.వీ.పీ బుకింగులు కూడా ఓపెన‌య్యాయి. ఇక రిలీజ్ త‌ర్వాత టాక్ తో సంబంధం లేకుండానే సేఫ్ జోన్ కి వ‌చ్చేందుకు ప‌క‌డ్భందీ ప్లాన్ సాగుతోందిట‌. ఆ త‌ర్వాత ఎలాంటి తేడా జ‌రిగినా ముందుగానే తాము సేఫ్ జోన్ లో ఉండాల‌నేది ప్లాన్.

ఇక మ‌హేష్ - రాజ‌మౌళి చిత్రం స్క్రిప్టు ప‌నులు సాగుతుండ‌గా.. వచ్చే ఏడాది ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్ప‌టికే ప‌లు క‌థ‌ల‌ను రాజ‌మౌళి మ‌హేష్ కి వినిపించినా ఏదీ ఖ‌రారు చేయ‌లేద‌న్న టాక్ ఉంది. దీంతో ఆ ఇద్ద‌రూ సీరియ‌స్ గా ఇక‌పై త‌మ ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తార‌ని క‌థా చ‌ర్చ‌లు సాగిస్తార‌ని తెలుస్తోంది.