Begin typing your search above and press return to search.
కథ వినకుండానే సై అన్నారు.. అదీ రేంజ్
By: Tupaki Desk | 12 April 2018 5:30 PM GMTప్రతిభ ఉన్న వాళ్లతో పనిచేసేందుకు నటీనటులు ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎంత కమర్షియల్ ఇండస్ట్రీ అయినా జాబ్ శాటిస్ఫాక్షన్ దక్కుతుందని.. ఓ మంచి సినిమాను చేశామని.. ఓ గొప్ప పాత్రలో నటించామనే సంతృప్తి మిగిలితే చాలు.. మిగతా ఏమీ ఆలోచించకుండా.. ఆశించకుండా.. కనీసం కథ కూడా వినకుండా సినిమాను ఒప్పుకోవడం అంటే.. చాలా గొప్ప విషయమే. ఇలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న దర్శకుల జాబితాలో సుకుమార్ ను ప్రముఖంగా చెప్పుకోవాలి.
ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు ఉన్న సుకుమార్.. తన సినిమాలో క్యారెక్టర్లను ఖాయం చేసుకుంటూ.. ప్రెసిడెంట్ పాత్ర కోసం జగపతిబాబును అనుకున్నాడట. ఎప్పటి నుంచో సుకుమార్ తో సినిమా చేయాలని చూస్తున్న జగ్గూ దాదా.. జస్ట్ సుక్కూ వచ్చి.. క్యారక్టర్ బావుంటుంది సార్ అన్నాడట. దానితో జగపతి బాబు.. నాయనా కథ చెప్పొద్దు.. డేట్లు చెప్పు చాలు.. వచ్చేస్తా అన్నాడట. 'అలా కాదండీ.. మీది ప్రెసిడెంటు పాత్ర.. కనీసం ఒంటి మీద చొక్కా కూడా ఉండదు.. తన కోసం తానే పాలు పితుక్కుంటూ ఉంటాడు' అని సుకుమార్ చెబుతుంటే.. అవేమీ వినిపించుకోకుండా.. 'ఎప్పుడు షూటింగ్ కు రావాలో చెబితే చాలు.. డేట్స్ నేను ఎడ్జస్ట్ చేసుకుంటాను.. ఇంకేమీ చెప్పద్దు' అని చెప్పి సుకుమార్ ను పంపించేశాడట జగపతి బాబు.
సుకుమార్ కోసం అందరూ ఏ రేంజులో ఎదురు చూస్తున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది. అంతెందుకు.. రామ్ చరణ్ కు అత్త పాత్ర అంటే అనసూయ జడిసిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి.. 'అత్త ఏంటి.. మంచి రోల్ అయితే అమ్మమ్మ పాత్ర అయినా నటించేస్తా' అనడం లేదూ. ట్యాలెంటెడ్ డైరెక్టర్లతో చేస్తే అలా ఉంటుంది మరి.