Begin typing your search above and press return to search.

అవును ఆమెకు నాకు ఉన్న బంధం అదే.. అంటున్న స్టార్ హీరో

By:  Tupaki Desk   |   4 April 2020 11:30 PM GMT
అవును ఆమెకు నాకు ఉన్న బంధం అదే.. అంటున్న స్టార్ హీరో
X
అలనాటి అందాల నటి సౌందర్య గుర్తుందా.. చక్కగా తెలుగింటి ఆడపడుచు అంటే ఇలా ఉండాలిరా.. అని తెలుగు రాష్ట్రాల ప్రజలతో మన్ననలు పొందింది. నిజానికి సౌందర్య తెలుగు అమ్మాయి కాదు కన్నడ బంగారు బొమ్మ. ఆమె సొంత భాష లో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి సరసన నటించిన సౌందర్య అతి తక్కువకాలంలోనే ఎంతో గొప్ప పేరును సాధించింది. ఈ మధ్య విలక్షణ నటుడు జగపతి బాబు సౌందర్య గురించి స్పందించాడట. ఒక ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడుతూ.. 'సౌందర్యతో నాకున్న అనుబంధం చాలా పవిత్రమైనది. ఆమె సోదరుడు నాకు చాలా క్లోజ్‌. ఆ పరిచయం తో అప్పుడప్పుడు వాళ్ళింటికి కూడా వెళ్ళేవాడిని. సౌందర్య మాకు బంధువు లాంటిది తను కూడా మా ఇంటికి వస్తూ ఉండేది. కానీ సౌందర్యకు నాకు ఉన్న బంధం ఒక మంచి స్నేహబంధం మాత్రమే. కానీ ప్రజలు మాత్రం అపార్ధం చేసుకోవడంలో ముందుటారు' అంటూ వెల్లడించాడు.

అదీగాక 'సౌందర్యతో నాకు ఎవరైనా అఫైర్స్ ముడిపెడితే నేను సంతోషంగా భావిస్తా. నాకెందుకో వారు మా గురించి కామెంట్స్ చేసినా నేను మాత్రం కంప్లిమెంట్స్ లాగే తీసుకునేవాడిని. సౌందర్యకు నాకు మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. ఎన్ని రూమర్స్ వచ్చినా నేను మామూలుగానే స్వీకరిస్తా. అందరికి అఫైర్స్ అంటే నెగటివ్ గానే థింక్ చేస్తారు కానీ మాకు తెలుసు మేం ఏంటో.. మా అనుబంధం స్నేహం కన్నా పవిత్రమైనది. సౌందర్య తో అంతటి పవిత్రమైన అఫైర్ కలిగిఉన్న కానీ మీరనుకుంటున్నట్లు మాత్రం కాదు' అని జగ్గూభాయ్ ముక్కుసూటిగా సమాధానం ఇచ్చాడు. సౌందర్య, జగపతి బాబు పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అలా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక జగ్గూభాయ్ కూడా సౌందర్యతో తనకున్న అనుబంధం గురించి చాలా సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే.