Begin typing your search above and press return to search.
బాబు పాత్రలో బాబు??
By: Tupaki Desk | 30 Oct 2017 4:25 AM GMTహీరో క్యారెక్టర్లకు గుడ్ బై చెప్పేసి లెజెండ్ సినిమాతో విలన్ అవతారమెత్తాడు జగపతిబాబు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కొన్ని ప్రత్యేకమైన పాత్రల కోసం అతడిని ఏరి ఎంపిక చేసుకుంటున్నారు. శ్రీమంతుడులో మహేష్ బాబు తండ్రిగా.. నాన్నకు ప్రేమతో ఇంటలిజెంట్ విలన్ అయిన మల్టీ మిలియనీర్ గా జగపతి బాబు అందరినీ ఇంప్రెస్ చేశాడు. విఖ్యాత నటుడు ఎన్.టి.రామారావు జీవిత గాథతో బాలకృష్ణ హీరోగా చేస్తున్న మూవీలో జగపతిబాబును ఓ ముఖ్య పాత్రకు తీసుకోవాలని అనుకుంటున్నారనేది లేటెస్ట్ న్యూస్.
తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్’ బయోపిక్ కోసం ప్రస్తుతం నటీ నటుల ఎంపిక జరుగుతోంది. ఎన్టీఆర్ జీవిత గాథలో ఆయన అల్లుడు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర చాలా కీలకం. ఈ పాత్రకే జగపతిబాబు బాగా సూటవుతాడన్నది చిత్ర యూనిట్ ఆలోచన. ‘‘ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యేనాటికి చంద్రబాబు యువకుడు. కాస్తంత మేకప్ టచ్ ఇస్తే జగపతిబాబు యంగ్ లుక్ లోనూ బాగానే కనిపిస్తాడు. లెజెండ్ - శ్రీమంతుడు మూవీల్లోనూ కొంతసేపు యంగ్ గా కనిపిస్తాడు. అందుకే ఈ పాత్రకు జగపతి బాగా సూటవుతాడని’’ యూనిట్ లోని సభ్యుడు ఒకరు తెలిపారు.
రాజకీయాల్లో ఎన్టీఆర్ వెంట ఉన్నది ఆయన కొడుకు హరికృష్ణ. ఈ రోల్ హరికృష్ణ కొడుకు - హీరో కళ్యాణ్ రామ్ తో చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. కాంట్రవర్సీలకు తావు లేకుడా ఎన్టీఆర్ జీవిత గాథను ఓ మామూలు వ్యక్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే స్థాయి వరకు మాత్రమే పరిమితం చేసే ఆలోచనలో కూడా చేస్తున్నారనేది లేటెస్ట్ టాక్. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారు.