Begin typing your search above and press return to search.
జగ్గూభాయ్ ఆటో బయోగ్రఫీతో సీరియల్!
By: Tupaki Desk | 19 Aug 2015 4:16 AM GMTహీరోగా ఓ రేంజ్ లో వెలిగిన జగపతిబాబు వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడుదుడుకులు ఎదుర్కొన్నాడు. ఒక దశలో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంతో ఇష్టంగా కట్టుకొన్న ఇంటిని కూడా అమ్ముకొన్నాడు. అలాగని ఆయన జీవితం ఇంతటితో అయిపోయిందనుకోలేదు. నైరాశ్యంతో అస్సలు కుంగిపోలేదు. స్థైర్యం తో పోరాడాడు. విలన్ గా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టి మళ్లీ విజయాల్ని అందుకొన్నాడు. తెర పైనే కాదు.. నిజ జీవితంలోనూ తాను హీరోనే అని చాటి చెప్పాడు.
ఆనేక ఆసక్తికరమైన మలుపులతోకూడిన జగ్గూభాయ్ జీవితం ఆధారంగా ‘సముద్రం’ పేరు తో ఓ ధారావాహిక ప్రసారం కానుంది. పదమూడు ఎపిసోడ్ల తో ఆ సీరియల్ ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం కానుందట. జగపతిబాబు జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రానున్న ఈ ధారావాహిక ఆయన నేపథ్యం నుండి ప్రారంభం అవుతుంది. హీరోగా ఆయన సాధించిన సక్సెస్ లు, ఫెయిల్యూర్స్, సమాజంలో, రియల్ లైఫ్ లో జగపతిబాబు ఎలా ఉంటారు?, రీల్ లైఫ్ లో ఎలా ఉంటారు? వంటి చాలా విషయాలు ఆయన స్వయంగా ఈ సీరియల్ లో వివరిస్తారు. ఇంత వరకు ఇండియన్ సినీ హిస్టరీలో ఏ హీరో చేయని ప్రయోగంగా ఈ సీరియల్ రూపొందుతోందట. ‘సముద్రం’ అనే ధారావాహికకు సినీ జర్నలిస్ట్ వంశీ చంద్ర వట్టికూటి రచయితగా వ్యవహరిస్తున్నారు. ‘మ్యాంగో’ వంశీ నిర్మాణ, నిర్వహణ బాధ్యతను చూస్తారు.
ప్రతి ఒక్కరి జీవితాన్ని సముద్రంతో పోల్చుతుంటాం. ఎన్నో ఆటుపోట్లతో కూడుకున్న మనిషి జీవితం ఒక్కొక్క దరిని చేరుతుంటుంది. అయితే ఓటమి ఎదురైనప్పుడు మనిషి నిరాశ, నిస్పృహలతో కుంగిపోకుండా ముందుకు సాగాలనే జీవిత సత్యాన్ని తెలియజేసే విధంగా ఈ ‘సముద్రం’ ఉండబోతోందట. అన్నట్టు జగ్గూభాయ్ కి బుల్లితెర కొత్తేమీ కాదు. ఇదివరకు రియాలిటీ షోలు చేశాడు. వాటితో బాగానే ఆకట్టుకొన్నాడు. ఇప్పుడు మళ్లీ సొంత కథతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.