Begin typing your search above and press return to search.

ఆ దారి తెలీదంటున్న జగపతి

By:  Tupaki Desk   |   12 Jan 2016 4:04 AM GMT
ఆ దారి తెలీదంటున్న జగపతి
X
శ్రీ‌మంతుడు సినిమాతో ఇండ‌స్ర్టీ హిట్ అందుకున్నాడు జ‌గ‌ప‌తిబాబు. వెంట‌నే నాన్న‌కు ప్రేమ‌తో మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. లుక్ వైజ్ ఈ రెండు సినిమాల్లో సేమ్ క్యారెక్ట‌ర్లు చేస్తున్న‌ట్టే అనిపించినా ఇవి రెండూ పూర్తి వైవిధ్యం ఉన్న‌వి. శ్రీ‌మంతుడులో మ‌హేష్ త‌ర్వాత త‌నే హీరో. కానీ నాన్న‌కు ప్రేమ‌తో మూవీలో ఎన్టీఆర్ పాలిట విల‌న్‌ గా న‌టిస్తున్నాడు. హీరోతో మైండ్ గేమ్ ఆడే ప‌వ‌ర్‌ ఫుల్ క్లాస్ విల‌న్‌ గా క‌నిపించ‌బోతున్నాడు. ఓ ధ‌న‌వంతుడైన ఎన్నారై మైండ్ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపించ‌బోతున్నారు ఈ మూవీలో.

ఇప్ప‌టికే నాన్న‌కు ప్రేమ‌తో టీజ‌ర్లు చూస్తే ఆ సంగ‌తి అర్థ‌మైంది. ఇకపోతే ఈ మూవీలో త‌న క్యారెక్ట‌ర్ గురించి జ‌గ‌ప‌తి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ తో పోటీప‌డే రోల్ ఇది. తార‌క్ అద్భుతంగా న‌టించాడు. ఆన్‌ సెట్స్ ఉన్న‌ప్పుడు జోకులు, క్రాకులు లేవు. అన్నిటినీ వ‌దిలేసి సీరియ‌స్ మోడ్‌ లో చేశాం. ఎందుకంటే మా క్యారెక్ట‌ర్లు అలాంటివి మ‌రి అంటూ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్‌ లో న‌టిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు అక్క‌డ స్నేహితులున్నారు కానీ, ఎలా అవ‌కాశం వెతుక్కోవాలో తెలీదు అనేశాడు జ‌గ‌ప‌తి.

''నేను న‌టించిన ఓ సినిమాని ప్యార్ తో హోనా హై థా పేరుతో అజ‌య్‌ దేవ‌గ‌న్ రీమేక్ చేశారు. అప్ప‌ట్నుంచి త‌న‌తో కనెక్టివిటీ ఉంది. త‌ను నేను చేసేవాటికి ద‌గ్గ‌ర‌గా ఉండే హీరో అనిపిస్తుంది. అలాగే స‌ల్మాన్‌ ఖాన్ నా ఫేవ‌రెట్ హీరో. అత‌డి సినిమాలో న‌టించాల‌ని ఉంది. అయితే బాలీవుడ్‌ లో నాకు కొంత మంది స్నేహితులు ఉన్నా . అవ‌కాశం ఎలా ద‌క్కించుకోవాలో మాత్రం తెలీదు..'' అంటూ చెప్పుకొచ్చాడు. విల‌న్‌ గా మారాక త‌న కెరీర్ చాలా బావుంద‌ని, అభిమానులు యాక్సెప్ట్ చేశార‌ని జ‌గ‌ప‌తి తెలిపాడు.