Begin typing your search above and press return to search.
రజినీ సినిమాతో పోల్చుకుంటున్న జగపతి
By: Tupaki Desk | 10 Aug 2017 10:35 AM GMTచక్కగా విలన్.. క్యారెక్టర్ రోల్స్ తో జగపతిబాబు కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆయనకు మళ్లీ హీరో వేషంపై మనసు పుట్టింది. ‘వారాహి చలనచిత్రం’ బేనర్లో ‘పటేల్ సార్’ అనే సినిమా మొదలుపెట్టాడు. ఇంకా షూటింగుకి కూడా వెళ్లకుండానే ఒక ఆసక్తికర టీజర్ రూపొందించి ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది జగపతిబాబు టీం. కానీ ఈ సినిమా గురించి ఏదో ఆశించి వెళ్తే ఇంకేదో చూపించారు. ‘పటేల్ సార్’ ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేసింది. జగపతిబాబు కూడా ఈ సినిమా ఫలితం చూసి డీలా పడిపోయాడు. ఇప్పుడు తీరిగ్గా తాము చేసిన తప్పేంటో చెబుతున్నాడు జగపతిబాబు.
‘పటేల్ సార్’ విషయంలో తాము చేసిన అతి పెద్ద తప్పు ఆ టీజర్ రూపొందించడమే అంటున్నాడు జగపతిబాబు. ఆ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసిందని.. ప్రేక్షకులు ఏదో ఆశించి సినిమాకు వచ్చి అది లేకపోయేసరికి నిరాశ చెందారని అన్నాడు జగపతి. బిరియాని కోరితే తాము మీల్స్ పెట్టినట్లుగా.. ప్రేక్షకులు థ్రిల్లర్ సినిమాను ఆశిస్తే కుటుంబ కథా చిత్రం చూపించామని జగపతిబాబు చెప్పాడు. ఇంతకుముందు తాను నటించిన ‘కథానాయకుడు’ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగిందని అతనన్నాడు. ప్రేక్షకులందరూ సూపర్ స్టార్ రజినీకాంత్ విన్యాసాల కోసం థియేటర్లకు వచ్చారని.. కానీ థియేటర్లలోకి వస్తే సామాన్యుడైన తాను కనిపించానని.. నిరాశ చెంది సినిమాను తిప్పి కొట్టారని జగపతిబాబు చెప్పడం విశేషం.