Begin typing your search above and press return to search.
నా అంత నీచుడు ఉండడు : జగపతి బాబు
By: Tupaki Desk | 10 July 2018 6:04 AM GMTఒకప్పుడు హీరోగా వెలుగు వెలిగి ఆ తర్వాత కాలంలో తెరమరుగైపోయాడు జగపతిబాబు. మళ్లీ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’ మూవీతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. విలనిజానికి పర్ ఫెక్ట్ నిర్వచనం చెబుతూ... నటిస్తూ.. శభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా ఆయన సాక్ష్యం సినిమాలో నటిస్తున్నాడు. సాక్ష్యం సినిమాలో చేసిన పాత్ర చూస్తే జనాలు తనను కొడతారని అంటున్నాడు. తనంత నీచుడు ఎవడూ లేడని సినిమా చూశాక అనిపించిదన్నాడు.
‘సాక్ష్యంలో విలనిజం నాకు బాగా నచ్చింది. లోకంలో ఇంతకంటే నీచుడు ఉండడు. ఇప్పటివరకూ నా పాత్రల్ని ప్రేక్షకులు క్షమిస్తూ భరించారు. కానీ ఈసారి కష్టం. ఇందులో విలన్ అంత ఎధవ’ అంటూ జగపతిబాబు పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. ఇలాంటి పాత్రలు చేస్తే తన మీద తనకే భయం వేస్తోందని అన్నాడు. రొటీన్ లైఫ్ లో కూడా తను ఇలా మారిపోతానేమో అన్న భయాన్ని బయటపెట్టాడు.
ఇక తన పాతచిత్రాల్లో విలనిజం ఇలా లేదంటూ చెప్పుకొచ్చాడు.. ‘లెజెండ్ సినిమాలో విలన్ పాత్రకు ఇగో ఉంటుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో క్లాస్ విలన్ గా కనిపించా.. రీసెంట్ గా జయజానకీ నాయకలో విలన్ కు పరువు పిచ్చి ఉంది. ఇలా ఇన్నాళ్లు నేను చేసిన విలన్ పాత్రలకు ఓ పర్సస్ ఉంది. కానీ సాక్ష్యంలో విలన్ కు పర్సస్ ఉండదు. కేవలం డబ్బు.. డబ్బు .. పరమ ఎధవ క్యారెక్టర్ ఇదీ’ అంటూ జగపతి తన పాత్ర స్వారూపాన్ని విశ్లేషించారు.
ఎన్నో రకాల విలన్ పాత్రలు చేసినప్పటికీ.. కెమెరా నుంచి బయటకు వచ్చాక భగవంతుడి దయవల్ల అలాంటి ఛాయలు తనలో కనిపించడం లేదని జగపతి బాబు ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఒకప్పుడు స్క్రీన్ పై నేను చాలా సాఫ్ట్.. ప్లే బాయ్.. అలాంటి నేను ఇప్పుడు విలన్ పాత్రలు వేస్తానని అనుకోలేదు. కానీ వేశాను. నా ఖర్మకాలి అవి హిట్ అయ్యాయి. నా కెరీర్ కూడా బాగుంది. కాబట్టి అలాంటి పాత్రలు వేస్తూనే ఉంటా.. చూద్దాం. ఈ ప్రయాణం ఎక్కడివరకో..’ అంటూ తన జీవితంలో జరిగిన మార్పులను పంచుకున్నారు.