Begin typing your search above and press return to search.

సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లో జగపతి కేక

By:  Tupaki Desk   |   14 Jan 2016 4:43 AM GMT
సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లో జగపతి కేక
X
నెరిసన గెడ్డం.. కాస్త గ్రే కలర్‌ లో.. కాస్త బ్లాక్‌ గా.. కాస్త తెల్లగా ఉంటే.. దానినే సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ అంటారు. ఆ లుక్‌ సరదాగా ఫోటోల కోసమే కాదు.. దానితో కూడా ఒ క్యారెక్టర్‌ ను చంపేయొచ్చు తెలుసా అంటూ ప్రూవ్‌ చేసేశాడు మన జగపతి బాబు. నాన్నకు ప్రేమతో సినిమాలో విలన్‌ కృష్ణమూర్తి కౌటిల్య గా మనోడు చేసిన క్యారెక్టర్‌.. ఆ లుక్‌.. అబ్బో పీక్స్‌ అంతే.

నిజానికి నాన్నకు ప్రేమతో సినిమాకు జగపతిబాబే సెకండ్‌ హీరో. ముఖ్యంగా మనోడు ఎదుటవారికి రెండు బాల్స్‌ ఇచ్చి.. అందులో ఒకటి తీస్కో అంటూ చెప్పే స్టోరీ.. ''ఈ విషయం గుర్తు పెట్టుకో.. దీని గురించి మళ్ళీ మాట్లాడతా..'' అని కాన్వర్జేషన్‌ మొదలెటి్ట.. ఆ తరువాత మొత్తం మ్యాటర్‌ క్లోజ్‌ అయ్యాక.. ''ఇందాక ఒక విషయం గుర్తు చేయమన్నా..'' అంటూ అడిగి.. ఆ విషయంతో మనోడు పంచ్‌ వేసిన తీరు అద్భుతం. సుకుమార్ అండ్ టీమ్‌ ఎంత అద్భుతంగా రాసినా కూడా.. అసలు ప్రాణం పోసింది మాత్రం జగ్గూ భాయే.

ఇకపోతే మొత్తం సినిమాలో సూట్స్‌ లో కనిపిస్తూ.. కూల్‌ మాట్టాడుతూ తడి గుడ్డ వేసి గొంతు కోసేసినట్లు మనోడు చేసిన నటన ఒక పీక్‌ అయితే.. అసలు ఏ మాత్రం వాయిస్‌ లెవెల్‌ పెరగకుండా.. కేవలం కళ్లతో డైలాగులు పేలుస్తూ చేసిన కొన్ని ఎక్సప్రెషన్లు మరో రేంజ్‌. ఓవరాల్‌ బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ వంటి షీల్డుడు మనోడు ఈ పాత్రకు అందుకునే ఛాన్సుంది.