Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: ఆ గ్రేసు ఆ స్టైలు.. జగ్గుభాయ్ రచ్చ
By: Tupaki Desk | 14 Dec 2019 7:43 AM GMTసీనియర్ హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతిబాబు కు మొదటి నుంచి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. హీరోగా ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వరసగా ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగి పోయే హీరో పాత్రలు ఎన్నో చేసి ప్రేక్షకులను మెప్పించారు. హీరోగా ఫేడ్ అవుట్ అయ్యే దశలో బోయపాటి-బాలయ్య సినిమా 'లెజెండ్' లో విలన్ గా నటించి ఒక్కసారిగా అందరిని ఇంప్రెస్ చేశారు. అప్పటి నుంచి విలన్ పాత్రలు.. క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల ను మెప్పిస్తున్నారు.
జగపతిబాబు వయసు ఇప్పుడు 57. అయినా ఇప్పటికీ ఫిట్నెస్ కొనసాగిస్తూ ఈతరం హీరోలకు పోటీనిస్తున్నారు. ఆ స్టైల్.. ఆ గ్రేస్ చూస్తే జగ్గుభాయ్ కి ఫిదా కానివారు ఉండరు. ఈమధ్య జగ్గుభాయ్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో బయటకు వచ్చింది. ఈ ఫోటోలో ఒక ఫారెన్ లొకేషన్ లో యమా స్టైల్ గా నిలుచున్నారు. వైట్ కలర్ టీ షర్టు - గ్రే కలర్ జాకెట్ ధరించి కూలింగ్ గ్లాసెస్ తో ఒక హాలీవుడ్ హీరో తరహాలో కనిపిస్తున్నారు.
ప్రస్తుతం జగపతిబాబు కన్నడలో 'రాబర్ట్' అనే సినిమాలో నటిస్తున్నారు. పైనున్న ఫోటో ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తీయించుకున్నదని అంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే నాని-ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా 'V' లో ఒక కీలక పాత్రలో పోషిస్తున్నాడు. హిందీలో అజయ్ దేవగణ్ సినిమా 'తానాజీ' లో కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.