Begin typing your search above and press return to search.

క్రేజీ ఆఫర్లను కుదరదంటున్న జగ్గూ భాయ్

By:  Tupaki Desk   |   14 Jun 2016 8:08 AM GMT
క్రేజీ ఆఫర్లను కుదరదంటున్న జగ్గూ భాయ్
X
ఫ్యామిలీ హీరో అనే క్లీన్ ఇమేజ్ నుంచి.. రగ్గెడ్ విలన్ అనే రేంజ్ కి టర్నింగ్ ఇచ్చేసుకున్నాక.. జగపతి బాబు కెరీర్ మామూలుగా లేదు. లెజెండ్ మూవీలో క్రూరమైన విలన్ గా జగపతి చేసిన పాత్ర.. సూపర్బ్ గా క్లిక్ అయింది. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో చిత్రంలో హై ప్రొఫైల్ విలన్ గా కూడా ఆకట్టుకోవడంతో.. ఇక ఈ రోల్స్ కి తిరుగులేదనే స్టేజ్ కి వచ్చేశాడు జేబీ.

ఇప్పుడీ సీనియర్ నటుడు ఎంత బిజీ అయిపోయాడంటే.. భారీ ఆఫర్స్ వచ్చినా డేట్స్ లేవు మొర్రో అని తిప్పి పంపేయాల్సి వస్తోందట. గత నెల రోజుల్లో స్టార్ హీరోల భారీ చిత్రాలకు సంబంధించిన 3 ఆఫర్స్ ను తిప్పి పంపేయాల్సి రావడం చూస్తే.. జగపతి పొజిషన్ ఎలా ఉందో అర్ధమవుతుంది. ఇలా స్టార్ హీరోలకు విలన్ రోల్ ను తిరస్కరించడం వెనక.. వేరే రీజన్స్ ఏమీ లేవు. జస్ట్ డేట్స్ ఖాళీ లేకపోవడంతోనే.. ఇలా చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

తమిళంలో విజయ్ కి విలన్ గా ఓ సినిమా - టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్- పూరీ జగన్నాథ్ ల మూవీ ఒకటి సెట్స్ పై ఉన్నాయి. ఇంకా మరిన్ని మూవీస్ లోని పాత్రలకు ఇప్పటికే డేట్స్ ఇచ్చేశాడు ఈ మాజీ హీరో కం తాజా విలన్. ఏమైనా ఒక డెసిషన్ ఒక జీవితాన్నే మార్చేస్తుందనే సెంటెన్స్ ని ఎవరైనా నమ్మకపోతే.. వాళ్లని అర్జంటుగా జగపతి బాబు దగ్గరకు తీసుకొచ్చేసి.. విలన్ గా మారడం అనే నిర్ణయాన్ని డేరింగ్ గా తీసుకున్న విషయాన్ని చెప్పించాలి.