Begin typing your search above and press return to search.

'గూఢచారి' చూసి సిగ్గుపడాలి-జగపతిబాబు

By:  Tupaki Desk   |   14 Aug 2018 4:02 AM GMT
గూఢచారి చూసి సిగ్గుపడాలి-జగపతిబాబు
X
‘గూఢచారి’ సినిమా చూసి ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ కొన్ని రోజుల కిందటే సీనియర్ హీరో అక్కినేని నాగార్జున పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సిినిమాను ఆయన ఒక రేంజిలో పొగిడేశాడు. ఈ సినిమా చూశాక తామంతా ఇలాంటి సినిమాలు తీసే సత్తా తమకు లేదా అన్న సందేహం కలుగుతోందని నాగ్ అన్నాడు. ఇప్పుడు మరో సీనియర్ హీరో జగపతిబాబు కూడా ఇదే తరహాలో మాట్లాడాడు. ఆ సినిమాను.. చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. జగపతి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘గూఢచారి’ టీం ఆయన్ని సన్మానించింది. ఈ సందర్భంగా జగపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘30 ఏళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవి గారు నా తొలి షాట్ కు క్లాప్ ఇవ్వడంతో ఈ ప్రయాణం మొదలైంది. ఇది నా జీవితంలో మరపురాని సాయంత్రం. గూఢచారి లాంటి సినిమాతో 30 ఏళ్ల వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ అయిపోయింది అనుకున్న సమయంలో లెజెండ్ వచ్చింది. ఆ సినిమాకు పారితోషకం ఎంత అడగాలో కూడా నాకు అర్ధం కాలేదు నేను ఇండస్ట్రీ కి వచ్చి 30 ఏళ్లు అయిందని నాకు ఎవరూ కాల్ చేయలేదు..అందుకు కారణం నేనే.. నేను ఎవరితోనూ ఈ విషయాన్ని పంచుకోలేదు. నా కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా గాయం. ఐతే అందులో నేను నటించలేదు. ఆర్జీవీ నా మొహం అలా చూపించాడు అంతే. గూఢచారి విషయానికి వస్తే ఇండస్ట్రీ జనాలు ఈ సినిమా చూడాలి. నేర్చుకోవాలి - కొంతమంది ఈ సినిమా చూసి సిగ్గు పడాలి. నా ఈ 30 ఏళ్ల ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్నతలు. ఇండస్ట్రీ లో వెధవలు ఉన్నారు. వాళ్లకు తెలియదు వాళ్లు వెధవలు అని. మనమే తెలుసుకోవాలి. అలాంటి వాళ్లకు నాకు సంబంధం లేదు’’ అని జగపతి అన్నాడు.