Begin typing your search above and press return to search.
ప్రేమ వైఫల్యంపై జగపతిబాబు..
By: Tupaki Desk | 1 April 2018 11:30 PM GMTప్రతి వ్యక్తీ ఏదో ఒక దశలో ఎవరితోనో ఒకరితో ప్రేమలో పడాల్సిందే అంటారు చాలామంది. తాను కూడా ఆ కోవలోని వాడినే అంటున్నాడు జగపతిబాబు. తాను కూడా యుక్త వయసులో ఒక అమ్మాయిని చాలా సిన్సియర్ గా ప్రేమించానని ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు వెల్లడించాడు. ఐతే తన ప్రేమను సక్సెస్ చేసుకోలేకపోయానని.. కానీ ఇప్పుడు ఆ విషయంలో తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని ఆయన తెలిపాడు.
తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పానని.. ఐతే తన తల్లి ఆ ప్రేమను అంగీకరించలేదని.. ఆమె మాట ప్రకారమే ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నానని.. ఆ సమయంలో తన ప్రపంచమే కూలిపోయిన భావన కలిగిందని.. జీవితమే లేదనుకున్నానని.. కానీ ఆ తర్వాత కొంత కాలం గడిచాక మాత్రం తన తల్లి చేసిందే కరెక్ట్ అనిపించిందని జగపతిబాబు చెప్పాడు.
ప్రేమ విఫలమైతే అంతా అయిపోయిందని ఎవ్వరూ అనుకోకూడదని.. కొన్నిసార్లు రెండో వైపు కూడా ఆలోచించాలని.. కుటుంబం సంగతి కూడా చూసుకోవాలని జగపతిబాబు చెప్పాడు. అదే సమయంలో పిల్లల ప్రేమను కూడా పెద్ద వాళ్లు ఆలోచించాలని.. కులం గురించో.. మరో విషయం గురించో ఆలోచించి ప్రేమికుల్ని దూరం చేయకూడదని జగపతిబాబు చెప్పాడు. తాను తన కూతురి ప్రేమను అంగీకరించి ఒక విదేశీ కుర్రాడితో పెళ్లికి అంగీకరించానని.. వాళ్లు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన వెల్లడించాడు.