Begin typing your search above and press return to search.

అందుకే.. నాకు నంది అవార్డు

By:  Tupaki Desk   |   17 Nov 2017 1:19 PM GMT
అందుకే.. నాకు నంది అవార్డు
X
చాలామంది సీనియర్ నటీనటులు ప్రస్తుతం ప్రత్యేకపాత్రల్లో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక విలన్స్ గా కూడా మెప్పిస్తున్నారు. వారిలో జగపతి బాబు ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులు మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఎదుర్కొన్న జగపతి విలన్ గా లెజెండ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి రికవర్ అయ్యారు. కేవలం సహా నటుడిగా కనిపిస్తే ఆదరించిన ప్రేక్షకులు విలన్ గా చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం జగపతికి ముందు కలిగిందట.

కానీ ఫైనల్ గా నన్ను ఆదరించి ఆదుకున్నారని చెప్పాడు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులలో లెజెండ్ సినిమాకు గాను బెస్ట్ విలన్ క్యాటగిరిలో జగపతి బాబు అవార్డును అందుకున్నాడు. ఈ సందర్బంగా అయన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపాడు. నేను మొదట హీరోగా చేసిన సింహ స్వప్నం సినిమా మూడు రోజులు మాత్రమే ఆడింది. కానీ విలన్ గా చేసిన లెజెండ్ సినిమా మాత్రం మూడేళ్లు ఆడింది. ప్రజల నుండి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించింది. నంది అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవార్డ్ రావడానికి కారణం దర్శకుడు బోయపాటి శ్రీను. విలన్ గా చూపించి మంచి గుర్తింపు అందేలా చేశాడు.

మంచి నటుడు ఎక్కుడున్నా.. మంచి దర్శకుడు తప్పకుండా గుర్తిస్తాడు. అదే బోయపాటి చేశాడు. ఈ విషయం గాయం సినిమాతో నాకు తెలిసి వచ్చింది. రామ్ గోపాల్ వర్మ నాకు ఇండస్ట్రీకి రాకముందు నుంచి మంచి ఫ్రెండ్. కొన్ని సినిమాల్లో నన్ను చూసి గాయం సినిమా చేయించారు. ఆ సినిమా కెరీర్ లో మరచిపోలేని సినిమా. నాకు మంచి విజయాన్ని, సంతృప్తిని ఇచ్చిందని జగపతి తెలియజేశారు.