Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ గెట‌ప్ బాబుకి న‌చ్చ‌లేదు

By:  Tupaki Desk   |   12 Jan 2016 4:20 AM GMT
ఎన్టీఆర్ గెట‌ప్ బాబుకి న‌చ్చ‌లేదు
X
‘నాన్న‌కు ప్రేమ‌తో’ సినిమా కోసం తాను ట్రై చేసిన కొత్త గెట‌ప్ చూసి త‌న‌కే భ‌యం వేసింద‌ని చెప్పాడు ఎన్టీఆర్‌. అత‌డికే అలా అనిపిస్తే చూసేవాళ్లకు ఏమ‌నిపిస్తుందో అంచ‌నా వేయొచ్చు. సామాన్య జ‌నాల సంగ‌తేమో కానీ.. స్వ‌యంగా జ‌గ‌ప‌తి బాబుకే ఎన్టీఆర్ లుక్ న‌చ్చ‌లేద‌ట‌. చాలామంది ఎన్టీఆర్ లుక్ గురించి అత‌డి ద‌గ్గ‌ర నెగెటివ్ కామెంట్స్ కూడా చేశార‌ట‌. కానీ అవేవీ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర తాను చెప్ప‌లేద‌ని.. కానీ ఒక్క‌సారి టీజ‌ర్ చూశాక మాత్రం త‌న‌తో పాటు అందరి అభిప్రాయాలు మారిపోయాయ‌ని చెప్పాడు జ‌గ‌ప‌తి

‘‘ఎన్టీఆర్ లుక్ చూడ‌గానే అదోలా అనిపించింది. కానీ అప్ప‌టికే షూటింగ్ మ‌ధ్య‌లో ఉండ‌టంతో ఏదో ఒక‌టి అని డిస్ట‌ర్బ్ చేయ‌డం బాగోద‌ని చెప్పి ఏమీ మాట్లాడ‌లేదు. చాలామంది ఎన్టీఆర్ లుక్ గురించి నెగెటివ్‌ గా మాట్లాడారు. ఒక‌సారి ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తితో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ను క‌ల‌వ‌బోతున్నాన‌ని చెప్పా. అత‌ను ఎన్టీఆర్ ను ముందు త‌ల స‌రిగా దువ్వుకోమ‌ని చెప్పండి అంటూ సెటైర్ వేశాడు. ఇలాంటి కామెంట్లు చాలా విన్నా. ఐతే ఒక్క‌సారి ఐ వానా ఫాలో ఫాలో అన్న పాట‌తో టీజ‌ర్ వ‌చ్చాక అంద‌రి అభిప్రాయం మారిపోయింది. అంద‌రూ ఎన్టీఆర్ లుక్ ఇష్ట‌ప‌డ్డం మొద‌లుపెట్టారు. నాకు కూడా నెమ్మ‌దిగా న‌చ్చ‌డం మొద‌లైంది.న‌చ్చ‌న‌పుడు ఏమీ చెప్ప‌లేదు కానీ.. న‌చ్చాక మాత్రం ఆ విష‌యాన్ని చాలాసార్లు చెప్పాను. లుక్ విష‌యంలో ఎన్టీఆర్ చెప్పిన ఓ మాట నాకు బాగా నచ్చింది. 100 ప‌ర్సంట్ రైట్ అయినా చేయాలి. లేదా 100 ప‌ర్సంట్ రాంగ్ అయినా చేయాలి. ఏదైనా ఆడ్‌ గా లేదా చాలా అందంగా క‌నిపించిన‌పుడు జనాల్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ లుక్ విష‌యంలో కూడా అదే జ‌రిగింది’’ అని జ‌గ‌ప‌తి చెప్పాడు.