Begin typing your search above and press return to search.

'టెంపర్‌'లో పోసాని రోల్‌ నేను చేసుంటే...

By:  Tupaki Desk   |   25 Jun 2015 11:30 AM GMT
టెంపర్‌లో పోసాని రోల్‌ నేను చేసుంటే...
X
చాలా రోజుల తరువాత జూనియర్‌ ఎన్టీఆర్‌ ''టెంపర్‌'' రూపంలో పూరిజగన్‌ డైరక్షన్‌లో ఓ సూపర్‌హిట్‌ కొట్టాడు. కాకపోతే బీభత్సమైన బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వచ్చినా కూడా సినిమా చివరకు ప్రపంచవ్యాప్తంగా 43.1 కోట్ల షేర్‌ మాత్రమే వసూలు చేసింది. మరో ప్రక్కన యావరేజ్‌ టాక్‌ వచ్చిన సినిమాలు కూడా 40 కోట్ల షేర్‌ తెచ్చుకుంటుంటే.. జూనియర్‌ సినిమాకు ఇంత తక్కువ ఎందుకొచ్చింది అంటూ అందరూ జుట్టు పీక్కుంటూనే ఉన్నారు.

ఈ విషయంపై మాజీ హీరో, ప్రస్తుతం బిజీగా ఉన్న విలన్‌ జగపతి బాబు ఒక ఇంట్రెస్టింగ్‌ విషయం చెప్పారు. ''నిజానికి టెంపర్‌ సినిమాలో పోసాని చేసిన రోల్‌ నేను చేసుంటే ఎలా ఉండేది? నాలాంటి రేంజ్‌ ఉన్న హీరో ఎన్టీఆర్‌కు సెల్యూట్‌ పెట్టనంటే అది ఇంకోలా ఉండేది. చివరకు వేరే సీన్లు సెల్యూట్‌ పెడితే హీరో క్యారెక్టర్‌ ఎలివేట్‌ అయిపోయేది. అంటే ఫీలవుతారేమో కాని, సినిమాకు ఇంకో ఏడెనిమిది కోట్లు ఎక్కువ వచ్చుండేది'' అన్నాడు జగపతి. పోసాని పట్ల రెస్పక్ట్‌ ఉందని చెబుతూనే ఈ విషయం చెప్పాడు. పైగా ఇదంతా పూరిజగన్‌, బండ్ల గణేష్‌కు కూడా చెప్పాడు.

'అయ్యో మిమ్మల్ని పెడదాం అనే విషయం తట్టలేదు సార్‌' అని పూరి అంటే, 'మా బడ్జెట్‌లో మీరు చేస్తారని అనుకోలేదు సార్‌' అని బండ్ల గణేష్‌ అన్నాడు. అందరూ ఇలా ఎవరికి తోచింది వారు ఊహించేసుకోకుండా ముందు ఏదైనా క్యారెక్టర్‌ ఉన్నప్పుడు తనని ఎప్రోచ్‌ అవ్వండి అంటున్నాడు జగపతి. త్వరలో ఆయన సుకుమార్‌ సినిమాలో ఎన్టీఆర్‌కు ఆపోజిట్‌గా చేసే విలన్‌ రోల్‌ అద్భుతమట. అది సంగతి.