Begin typing your search above and press return to search.
సౌందర్యతో అఫైర్ పై పెదవి విప్పాడు
By: Tupaki Desk | 31 March 2017 5:38 PM GMTజగపతిబాబు ఇప్పుడంటే ఘోరమైన.. క్రూరమైన విలనీ చూపించేస్తున్నాడు కానీ.. గతంలో ఈయన ఓ స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాడు. ఫ్యామిలీ చిత్రాలకు స్టార్ డం కూడా తెచ్చిపెట్టేసిన ఘనత జగపతిబాబుది. జగపతి పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో.. సినిమాల గురించే కాకుండా.. అనేకమంది హీరోయిన్లతో ఎఫైర్ ఉందంటూ రూమర్స్ వచ్చేవి.
మిగతావారి పేర్లంతా ఒక లెక్క అయితే.. అందాల హీరోయిన్ సౌందర్య విషయంలో మరీ ఎక్కువగా వినిపించేవి. ఎప్పుడూ వీటిపై జగపతిబాబు స్పందిచలేదు కూడా. కానీ ఇన్నేళ్ల తర్వాత సౌందర్యతో ఎఫైర్ విషయంలో ఈయన పెదవి విప్పాడు. తనకు సౌందర్యతో ఆఫ్ స్క్రీన్ అఫైర్ ఏదీ లేదన్న జగపతిబాబు.. అఫైర్ అంటే సెక్సువల్ రిలేషన్ మాత్రమే అనుకోవడం కామాంధుల పని అనేశాడు. జనాలకు ఒక్కోళ్ల గురించి ఒక్కో ఆలోచన ఉంటుందని.. సౌందర్య విషయానికి వస్తే.. తను నాకు మంచి ఫ్రెండ్' అన్నాడు జగపతి బాబు.
'మా ఇద్దరి మధ్య ఎంతో ఆరోగ్యవంతమైన రిలేషన్ ఉండేది. దీన్ని మీడియాతో పాటు చాలామంది అపార్ధం చేసుకున్నారు. ఆమెతో అఫైర్ ఉందని వార్తలొచ్చినపుడు నేను అప్ సెట్ కాలేదు.. అదో కాంప్లిమెంట్ గా భావించా' అన్నాడు జగపతి బాబు. ఆనాటి రిలేషన్ పై మాట్లాడ్డమే కాకుండా.. ఆ రూమర్స్ ను కాంప్లిమెంట్ గా భావించానని జగపతి చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/