Begin typing your search above and press return to search.

జగ్గూ మొదటిసారి ఇలా

By:  Tupaki Desk   |   4 Aug 2018 4:27 AM GMT
జగ్గూ మొదటిసారి ఇలా
X
బహుశా టాలీవుడ్ లో చాలా అరుదుగా ఇలాంటి ప్రయత్నం జరిగింది అనుకోవాలి. జనాలు ఎప్పుడో మర్చిపోయిన స్పై సినిమాను తెలుగులో తీయడం ఒక ఎత్తైతే అందులో మెయిన్ విలన్ ఎవరో కనీసం చిన్న క్లూ కూడా బయటికి ఇవ్వకుండా రహస్యంగా మైంటైన్ చేయటం మరో ఎత్తు. ఈ రెండు బాగా వర్క్ అవుట్ అయ్యి గూఢచారికి థియేటర్ లో రెస్పాన్స్ రూపంలో తెలిసిపోతోంది. నిజానికి గూఢచారి ప్రోమోస్ లో ఎక్కడా జగపతి బాబు ఉన్నాడు అనే హింట్ ఎవరూ ఇవ్వలేదు. లీకుల విషయంలో చాలా అలెర్ట్ గా ఉండే మీడియా సైతం ఈ విషయాన్ని పసిగట్టలేదు.

నిన్న థియేటర్లో నేరుగా ఊహించని మలుపులో జగ్గుని చూసేసరికి ఫాన్స్ షాక్ తిన్నారు. అసలు సెకండ్ హాఫ్ మొత్తం మలుపు తిరిగే పాత్ర కావడంతో రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. నిజానికి జగపతిబాబు ఒక సినిమాలో తన ఉనికిని దాచుకుని నేరుగా థియేటర్ లో సర్ ప్రైజ్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. 29 ఏళ్ళ క్రితం టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాడు.

మోస్ట్ వాంటెడ్ విలన్ అఫ్ తెలుగు సినిమాగా గత రెండేళ్లలో చాలా సినిమాలు చేసిన జగపతి బాబుకి గూఢచారి ఇచ్చింది మాత్రం స్పెషల్ మెమరీ అని చెప్పొచ్చు. ఆ పాత్ర తాలూకు ట్విస్టు కూడా అంత ఈజీగా గెస్ చేసేది కాకపోవంతో స్క్రీన్ ప్లే కి ప్రేక్షకులు థ్రిల్ అవుతున్న మాట నిజం. అన్నట్టు అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన రెండు సినిమాల్లోనూ జగ్గుదే కీలక పాత్ర కావడం గమనార్హం. బెల్లంకొండ సరి శ్రీనివాస్ సాక్ష్యంతో పాటు ఇప్పుడు అడవి శేష్ గూఢచారి లో జగపతి బాబు ఉన్నాడు, ఈ రెండూ అభిషేక్ బ్యానర్ నుంచి వచ్చినవే. మొదటిరోజు చాలా డీసెంట్ గా క్షణం కన్నా మెరుగైన ఓపెనింగ్స్ తో మొదలుపెట్టిన గూఢచారి పోటీ ఉన్నప్పటికీ సాలిడ్ గా నిలిచేలా ఉన్నాడు. అడవి శేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో గూఢచారికి చిలసౌతో మంచి పోటీ ఉన్నప్పటికీ రెండు డిఫరెంట్ జానర్స్ కావడంతో వేటికవే తమ టార్గెట్ ఆడియన్స్ ను రప్పించుకుంటున్నాయి.