Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో జగ్గు భాయ్!!

By:  Tupaki Desk   |   8 Aug 2017 7:32 AM GMT
బాలీవుడ్ లో జగ్గు భాయ్!!
X
సినిమా జీవితాల్లో స్టార్ హోదా ఎన్ని రోజులు ఉంటుందో ఎవరు చెప్పలేరు. కెరీర్ ను చక్కబెట్టుకునే ప్రయత్నాల్లో తెలియకుండా వేసిన కొన్ని తప్పటడుగులు జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయి. కానీ వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్ళేవాడే అసలైన హీరో. హీరో పాత్రలు దక్కకపోతే ఏంటి? సినిమారంగంలో ఉండాల్సింది నటన. అవకాశం వచ్చినపుడు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడం అసలైన నటుడి లక్షణం. ఆ సర్వ లక్షణాలు ఉన్న నటుడిగా ప్రస్తుతం టాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న నటుడు జగపతి బాబు.

ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న జగపతి బాబు ఇప్పుడు విలన్ గా చేస్తూ.. మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం తెలుగులోనే కాకుండా జగపతి తమిళ్ - మలయాళం సినిమాలోనూ నటిస్తున్నాడట. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. త్వరలో ఆ చిత్రానికి సంబందించిన పాత్రను, వివారాలను తెలియయజేస్తానని మీడియాతో తెలిపారు. అంతే కాకుండా అఖిల్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు చెబుతూ.. ఆ పాత్ర తన కెరీర్ లో మరచిపోలేనిదిగా ఉంటుందని జగ్గు భాయ్ వివరించారు.

అయితే కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయినా పటేల్ సర్ గురించి ప్రస్తావిస్తూ.. జగపతి బాబు కొన్ని కామెంట్స్ చేశారు. సినిమా బాగానే వచ్చింది కానీ ప్రేక్షకుల ఊహలకు అందలేకపోయిందని, ఎక్కడో ఒక తప్పు చేశాం అని చెప్పారు. అలాగే ప్రేక్షకుడు బిర్యాని కోసం వస్తే..మేము భోజనం పెట్టామని తనదైన శైలిలో వివరించారు.