Begin typing your search above and press return to search.

జ‌గ్గూభాయ్ కొత్త పాయింట్ చెప్పాడు!

By:  Tupaki Desk   |   19 July 2015 5:52 AM GMT
జ‌గ్గూభాయ్ కొత్త పాయింట్ చెప్పాడు!
X
మ‌హేష్‌ బాబు `శ్రీమంతుడు` గురించి జ‌గ‌ప‌తిబాబు ఓ కొత్త విష‌యం చెప్పాడు. సినిమాలో మ‌హేష్‌ కి తండ్రిగా న‌టించాడాయ‌న‌. అంద‌మైన కొడుక్కి అంద‌మైన తండ్రి అన్న‌మాట‌. ఆడియో వేడుక‌లో జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ ``శ్రీమంతుడు ఒక మ‌ల్టీస్టారర్ సినిమా`` అని చెప్పుకొచ్చాడు. ఆ మాట చెప్ప‌గానే ఏ లెక్క‌న జ‌గ‌ప‌తిబాబు మ‌ల్టీస్టార‌ర్ సినిమా అంటున్నాడ‌బ్బా అని అంతా నోరెళ్ల‌బెట్టారు. అంత‌లోపే `నాతో సహా క‌థానాయ‌కులుగా న‌టించిన‌వాళ్లు ఇందులో ఏడుగురు ఉన్నార‌`ని బ‌య‌ట‌పెట్టారు. క‌థానాయిక‌లుగా న‌టించిన‌వాళ్లు కూడా ఏడుగురు ఉన్నార‌ని చెప్పాడు. ఎవ‌రెవ‌రెబ్బా అని ఆరా తీస్తే నిజంగానే బోలెడంత‌మంది స్టార్లు ఆ సినిమాలో క‌నిపిస్తారు.

జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్, రాహుల్ ర‌వీంద్ర‌న్, సుక‌న్య‌, పూర్ణ‌, స‌న‌మ్ శెట్టి, తేజ‌స్వి మ‌దివాడ... వీళ్లంద‌రూ హీరోహీరోయిన్లుగా న‌టించిన‌వాళ్లే. ఆ లెక్క‌న మ‌ల్టీస్టార‌ర్ సినిమా కాక‌పోతే ఏమ‌వుద్ది. కొర‌టాల శివ ఇంత భారీ క్యాస్టింగ్‌ ని భ‌లే సెట్ చేశాడు. తెర‌నిండా పాత్ర‌లున్న‌ప్పుడే ఎంట‌ర్‌ టైన్‌ మెంట్ పండుతుంది. కొర‌టాల శివ భావోద్వేగాల్ని కూడా బ‌లంగా పండిస్తుంటారు. ఆయ‌న తీసిన తొలి చిత్రం `మిర్చి`లో కూడా బోలెడ‌న్ని పాత్ర‌లు క‌నిపిస్తాయి. అదే ఫార్ములాతో `శ్రీమంతుడు` తెర‌కెక్కినట్టు అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రంతో త‌నకు భారీ పుట్టిన‌రోజు కానుక ల‌భించిన‌ట్ట‌వుతుంద‌ని మ‌హేష్ చెప్పుకొచ్చాడు.