Begin typing your search above and press return to search.

ఆ పోలికేంటి జ‌గ్గూభాయ్‌!

By:  Tupaki Desk   |   13 Aug 2015 5:48 AM GMT
ఆ పోలికేంటి జ‌గ్గూభాయ్‌!
X
`శ్రీమంతుడు`కీ, `శుభ‌ల‌గ్నం`కీ ఏమైనా పోలికా? కానీ జ‌గప‌తిబాబు మాత్రం ఆ రెండు సినిమాల్నీ ఓ గాట‌న క‌ట్టేశాడు. అదెలాగంటే శుభ‌ల‌గ్నం కూడా వ‌ర్షాకాలంలో విడుద‌లైంద‌ట‌. వ‌ర‌ద‌ల్ని కూడా లెక్క చేయ‌కుండా ప్రేక్ష‌కులు ఆ సినిమాని హిట్ చేశార‌ట‌. అది నిజ‌మే కావొచ్చు కానీ... ఇప్పుడస‌లు వ‌ర‌ద‌లు సంగతి ప‌క్క‌నెడ‌తాం, వ‌ర్షాలే లేవు క‌దా! కానీ జ‌గ్గూభాయ్ మాత్రం `శ్రీమంతుడు` హిట్టు అని చెప్పేందుకు, ఇలాంటి సమ‌యంలోనే త‌న `శుభ‌ల‌గ్నం` కూడా వ‌చ్చింద‌ని గుర్తు చేసుకొనేందుకు వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ట్టు క‌ల‌గ‌న్నాడు. అద‌న్న‌మాట సంగ‌తి.

శ్రీమంతుడు`లో మ‌హేష్‌ కి తండ్రిగా న‌టించాడు జ‌గ‌ప‌తిబాబు. సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లెట్టాక జ‌గ్గూభాయ్‌ కి వ‌చ్చిన హిట్ల‌లో శ్రీమంతుడు ఒక‌టి. మ‌హేష్‌ కి తండ్రి పాత్ర‌లో ఒదిగిపోయాడు. జ‌గప‌తిబాబు కూడా ఓ హీరోనే కాబ‌ట్టి ఆయ‌న కూడా అందంగానే ఉంటాడు. తెల్ల‌ గెడ్డం తీసేస్తే సినిమాలో ఈయ‌న విల‌నా హీరోనా? అని ఆశ్చ‌ర్య‌పోతారు ప్రేక్ష‌కులు. అందుకే మ‌హేష్‌ లాంటి అంద‌గాడికి తండ్రిగా జ‌గ‌ప‌తిబాబు చాలా బాగా కుదిరాడు. `శ్రీమంతుడు` విష‌యంలో ఆయ‌న చాలా హ్యాపీగా ఉన్నాడు.

ఇన్నాళ్లూ విల‌న్ పాత్ర‌ల‌కోస‌మే త‌న ద‌గ్గ‌రికొచ్చే ద‌ర్శ‌కులు ఇక నుంచి తండ్రి పాత్ర‌ల కోసం కూడా వ‌స్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాడు. ఆ ఆనందం ఆయ‌న‌లో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఎంత విల‌న్‌ గా మారినా, ఎంత తండ్రి పాత్ర‌ల్లో న‌టిస్తున్నా ఆయ‌న్ని నేటికీ ప్రేక్ష‌కులు ఓ హీరోలాగానే చూస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు కూడా త‌న సినిమాల్ని ఇలా అప్పుడ‌ప్పుడు గుర్తుకు తెచ్చుకొంటూ తాను హీరోని అన్న విష‌యం గుర్తు చేస్తున్నాడు.