Begin typing your search above and press return to search.
ఆయనకిద్దరులా నటించాలనుంది -జగపతిబాబు
By: Tupaki Desk | 27 July 2015 5:57 AM GMTఆ రోజుల్లో సినిమాలు వేరు. ఇప్పుడు సినిమాలు వేరు. అప్పుడు నాయకానాయికలు చెట్టు, పుట్ట పట్టుకుని తిరిగి డ్యూయెట్లు పాడుకునేవారు. ఇప్పుడలా కాదు. సీన్ మారిపోయింది అని అంటున్నాడు జగపతిబాబు. అంతేకాదండోయ్ అతడు నటించిన శ్రీమంతుడు మరో పదిరోజుల్లో రిలీజ్ కి వచ్చేస్తోంది కాబట్టి తన గురించిన ప్రచారం మొదలెట్టేశాడు.
విదేశాల నుంచి వచ్చిన ఓ సంపన్నుడైన ఎన్నారై ఊరిని దత్తత తీసుకున్నాక ఏం జరిగిందన్నదే కథాంశం. మహేష్ అద్భుతంగా నటించాడు. అతడు నటనలో పెర్ఫెక్షనిస్ట్. ప్రతిదీ పక్కాగా వచ్చేవరకూ వదిలిపెట్టడు. అతడితో కలిసి నటించడం బావుంది.. అని చెప్పాడు. తండ్రిలా వయసుడిగిన వాడిలా పండిన వెంట్రుకలు, గడ్డంతో కనిపించడం తనకి నామోషీ గా లేదని అన్నాడు. ఇప్పుడు నా వయసు 53. ఈ వయసులో ఇలాంటివే చేయాలని అన్నాడు. నాలుగేళ్ల క్రితం విలనీకి రెడీ అయినప్పుడు ఆ స్టెప్ ఎంతో ఎగ్జయిట్ చేసింది. ఇప్పుడిలా ఎంతో కెరీర్ ని ఆస్వాధిస్తున్నాని చెప్పాడు.
విమర్శలు ప్రతిసారీ వస్తూనే ఉంటాయి. అప్పట్లో గాయం లాంటి యాక్షన్ సినిమాలో చేసిన నేను ఆయనకిద్దరు, శుభాకాంక్షలు, శుభలగ్నం లాంటి ఫ్యామిలీ సినిమాల్లో నటించాను. గాయం లాంటివి చేయలేదెందుకు? అని ప్రశ్నించారంతా. అందుకే మధ్యలో గాయం2లో నటించా. అలాగే ఆయనకిద్దరు లా... ఇద్దరేసి హీరోయిన్ల తో మళ్లీ రొమాన్స్ చేయాలనుంది. అది మునుముందు సాధ్యమేనేమో! అంటూ మనసులోని కోర్కెను బైటపెడ్డాడు జగ్గూ భాయ్.. అది సంగతి.