Begin typing your search above and press return to search.
'గని' వరల్డ్ లో విలక్షణ నటుడి పాత్ర ఏంటంటే..?
By: Tupaki Desk | 13 Nov 2021 10:43 AM GMTటాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా కొన్నేళ్ల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన విలక్షణ నటుడు జగపతిబాబు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా అదరగొడుతున్నారు. వైవిధ్యమైన పాత్రల్లో తనదైన నటనతో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న జగపతిబాబు.. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ''గని'' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా ''గని''. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్ర బృందం.. గని వరల్డ్ లోని పాత్రలను ఒక్కటొక్కటిగా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నటి నదియా పోషిస్తున్న మాధురి పాత్రను రివీల్ చేయగా.. తాజాగా జగపతిబాబు లుక్ ని రిలీజ్ చేశారు.
'గని' చిత్రంలో ఈశ్వర్ నాథ్ పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఇందులో సీనియర్ నటుడు డిగ్నిటీగా ఉన్నారు. గని జీవితంలో ఈ పాత్ర ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నరేష్ - తనికెళ్ళ భరణి - ఉపేంద్ర - సునీల్ శెట్టి - నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నవంబర్ 15న 'గని' టీజర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
'గని' సినిమా రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ పతాకాలపై రూపొందుతోంది. అల్లు వెంకటేష్ - సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్ మరియు దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.