Begin typing your search above and press return to search.
సమంతపై సద్గురు కామెంట్స్
By: Tupaki Desk | 12 Sep 2019 8:10 AM GMTసమంత.. వెండితెరపై వెలిగే హీరోయినే కాదు.. సామాజిక సేవలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది ఈ అక్కినేని వారి కోడలు. ఇప్పటికే చిన్నారుల కోసం ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి ఆపరేషన్లను చేస్తోంది. ఇక తెలంగాణ చేనేత వస్త్రాలకు అంబాసిడర్ గా ప్రాచుర్యం కల్పిస్తోంది. ఇవే కాదు.. ఇటీవల సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన పిలుపులో సమంత భాగస్వామి అయ్యింది. కావేరీ కాలింగ్ పేరిట లక్ష మొక్కలు నాటేందుకు సిద్ధమైంది. తన అభిమానులను ఆ పని చేయాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. సమంత పిలుపుతో ఆమె అభిమానులు లక్షల మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చారు.
సద్గురు వాసుదేవ్ కావేరీ కాలింగ్ పేరిట దేశవ్యాప్తంగా మొక్కలు నాటే ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో టాలీవుడ్, బాలీవుడ్, స్టార్ హీరోహీరోయిన్లు భాగమై తమ వంతు సహకారం అందించారు. సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సమంత కూడా ఈ ఉద్యమంలో భాగస్వామి అయ్యి లక్ష మొక్కలు నాటేందుకు సిద్ధమైంది.
తను పిలుపునిచ్చిన ఉద్యమంలో భాగస్వామి అయిన సమంతపై తాజాగా సద్గురు వాసుదేవ్ ట్విట్టర్ వేదిక కామెంట్ చేశారు. ‘‘ప్రియమైన సమంత నువ్విచ్చిన పిలుపుతో ఎంతోమంది యువత ముందుకు వస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయం’’ అని కొనియాడారు. సమంత లక్ష్యాన్ని మించి రాణించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సమంత ఆశయం నెరవేరాలని ఆశీర్వాదం ఇస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్ తరాలకు మనం అదించే గిఫ్ట్ ఇదేనంటూ సమంతను పొగిడేశారు.