Begin typing your search above and press return to search.

#స‌లార్.. జ‌గ్గూ భాయ్ ని ఇంత వికృతంగా చూడ‌గ‌ల‌రా?

By:  Tupaki Desk   |   23 Aug 2021 6:09 AM GMT
#స‌లార్.. జ‌గ్గూ భాయ్ ని ఇంత వికృతంగా చూడ‌గ‌ల‌రా?
X
కేజీఎఫ్ సంచ‌ల‌నాల అనంత‌రం కేజీఎఫ్ 2 అత్యంత భారీ కాన్వాసుతో రూపొందింది. ఈ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా స‌లార్ ని అంత‌కుమించి అనే రేంజులో తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఆన్ లొకేష‌న్ నుంచి ప్ర‌భాస్ లుక్ లీకులు అంద‌గా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తాజాగా స‌లార్ నుంచి జ‌గ‌ప‌తి బాబు లుక్ కూడా రిలీజైంది.

జగపతిబాబు ఈ చిత్రంలో రాజమన్నార్ పాత్ర‌లో కనిపిస్తారు. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలలో ఒకటిగా ప్ర‌చార‌మ‌వుతోంది. అత‌డి గెట‌ప్ చూస్తుంటే క్రూర‌మైన విల‌న్ గా న‌టిస్తున్నార‌ని భావించాల్సి ఉంటుంది.

మాసిన గ‌డ్డం మీస‌క‌ట్టు చెదిరిన త‌లతో భృకుటి ముడివేసి ముడుత‌లు పడిన ముఖంతో జ‌గ‌ప‌తిబాబు లుక్ మొత్తం మారిపోయింది. అత‌డి గెట‌ప్ కి ప్రోస్త‌టిక్స్ ని ప్ర‌భావ‌వంతంగా ఉప‌యోగించార‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ ముక్కుకు ముక్కెర‌ను పెట్టుకుని చుట్ట తాగుతూ మాసీగా క్రూరంగానూ క‌నిపిస్తున్నాడు. అతడు విల‌నేనా లేక కీల‌క పాత్ర‌ధారి నా? అన్న‌ది ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది. వ‌రుస‌గా రిలీజ‌వుతున్న లుక్ లు స‌లార్ పై మ‌రింతగా అంచ‌నాలు పెంచేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

సినిమా గురించి మరింతగా ఎదురుచూసేలా ప్రేక్షకుల్లో మరింతగా అంచ‌నాలు పెంచేసారు. కొత్త పోస్టర్ పాత్ర గురించి కొంత హింట్ ని ఇచ్చింది. KGF సిరీస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ .. హోంబలే ఫిల్మ్స్ క‌ల‌యిక‌లో ఇది మూడో సినిమా. కీల‌క షెడ్యూల్ ని ఇటీవ‌ల పూర్తి చేశారు. ఫిబ్రవరి 2022 మొత్తం సినిమా పూర్త‌వుతుంది. ఈ సంవత్సరం చివరిలోగా కొత్త విడుదల తేదీని ప్ర‌క‌టిస్తారు.

సలార్ ను ప్రపంచానికి అందించడానికి మేము వేచి ఉండలేము! స‌లార్ కొత్త పోస్టర్ వెనుక ఉన్న ఆలోచన ఆ వేష‌ధార‌ణ‌లో కనిపించే ది ఏమిటో గ్ర‌హించాల‌ని ఉత్సుకతని సృష్టించే ప్ర‌య‌త్న‌మే ఇది. ప్రస్తుతం మనం వెల్లడించగలిగేది ఏమిటంటే.. ఈ పాత్ర సినిమాకి కీల‌క మ‌లుపు అవుతుంది`` అని మేక‌ర్స్ వెల్ల‌డించారు. ``స‌లార్ షూట్ జరుగుతున్న కొద్దీ మరిన్ని పాత్రల వివ‌రాలు తెలుస్తాయి. ఈ చిత్రం భారతీయ చిత్రంగా రూపొందుతోంది. ఇది ఇప్పటికే అన్ని భాషల్లో విడుదల చేస్తామ‌నే అంచనాలకు దారితీసింది. ఈ చిత్రం గురించి మరిన్ని అప్ డేట్స్ ఇచ్చేందుకు ఇంకా వేచి ఉండలేం`` అని ద‌ర్శ‌కుడు అన్నారు.

యాక్ష‌న్ మునుపెన్న‌డూ చూడ‌నంత కొత్త‌గా..!

స‌లార్ ని హోంబ‌లే ఫిల్మ్స్ అత్యంత‌ భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ఇప్పటికే రెట్రో స్టైల్లో ఇది మాస్ స్టోరీతో తెర‌కెక్కుతోంద‌న్న స‌మాచారం లీకైంది. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న‌ట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ స్థాయిని మించి యాక్ష‌న్ స‌న్నివేశా లు హైటైట్ గా ఉంటాయ‌ని ప్ర‌చారం సాగ‌డంతో అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఇంత‌లోనే స‌లార్ క‌థ లీకైంది. ఇది ఊహ‌కి అంద‌ని అద్భుత స్క్రిప్ట్ నేరేష‌న్ తో డిజైన్ చేసినట్లు లీకుల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

ఇంత‌కీ స‌లార్ క‌థేంటి? అంటే ఇది 1971 లో జ‌రిగిన ఇండో-పాక్ వార్ స్టోరీ అని స‌మాచారం. ఆ క‌థ‌ను ఆధారంగా చేసుకుని స్క్రిప్ట్ ని పూర్తిగా సినిమాటిక్ గా మ‌లిచిన‌ట్లు తెలిసింది. 1971 వార్ లో ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాలున్నాయి. ఆ యుద్ధం ఎంతో ఉత్కంఠ భ‌రితంగా సాగింది. 54 మంది భార‌త జ‌వాన్ల‌ను పాక్ నిర్భందించింది. వీరిలో 27 మంది ఆర్మీ సైనికులు.. 24 మంది వైమానిక ద‌ళ సిబ్బంది తో పాటు ఒక బీ.ఎస్.ఎఫ్ జ‌వాన్ ఉన్నారు. నిజానికి ఇంత మంది భార‌త సైనికులు పాక్ చెర‌లో ఉన్నార‌ని భార‌త‌ ప్ర‌భుత్వానికి కొంత కాలం వ‌ర‌కూ తెలియ‌దు.

ఇది ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. పాక్ వారిని ఇంకా బంధీలుగా ఉంచిందా? లేక హ‌త్య చేసి ప‌గ తీర్చుకుందా? అన్న‌ది ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. ఇరు దేశాల మ‌ధ్య ఈ వివాదం అప్పుడ‌ప్పుడు ర‌గులుతూనే ఉంటుంది. భారత అధికారులతో పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఈ విషయాన్ని సైతం వెల్ల‌డించారు. భుట్టో ర‌చించిన పుస్త‌కాల్లో సైతం ఈ విష‌యాన్ని పొందుప‌రిచారు. మ‌రి స్టార్ మేక‌ర్ ప్ర‌శాంత్ నీల్ స‌రిగ్గా ఇదే పాయింట్ ని ట‌చ్ చేస్తున్నారా? లేక వార్ లో ఇంకా అంత‌ర్గ‌త విష‌యాల్లోకి వెళ్ల‌బోతున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. కేజీఎఫ్ కూడా కోలార్ గ‌నుల బ్యాక్ డ్రాప్ లో జ‌రిగిన రియ‌ల్ స్టోరీనే తెర‌పైకి తీసుకొచ్చారు. అద్భుత‌మైన మేకింగ్ తో స్టార్ క్యాస్టింగ్ తో సినిమాని ఓ రేంజ్ లో చూపించారు. ఈ నేప‌థ్యంలో స‌లార్ అంత‌కు మించి ఉండ‌బోతుందా? అన్న ప్ర‌చారం అంత‌కంత‌కు హీట్ పెంచుతోంది. ఇది బార్డ‌ర్ వార్ నేప‌థ్యంలో దేశ‌భ‌క్తి చిత్రంగా ఉండ‌నుంది. ఇందులో ప్ర‌భాస్ దేశ‌భ‌క్తుడిగా క‌నిపిస్తారా? స్పై త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తారా? లేక ఆర్మీ అధికారినా? అన్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.