Begin typing your search above and press return to search.
కరోనా నేపథ్యంలో ఎమోషనల్ ట్వీట్ చేసిన జగ్గూభాయ్...!
By: Tupaki Desk | 24 April 2020 5:30 PM GMTకరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంటికి కనిపించని ఒక మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచం మొత్తాన్ని గుప్పిట పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ కు అగ్రరాజ్యాలు సైతం కుదేలైపోతున్నాయి. ప్రపంచాన్ని శాసించ గల సత్తా ఉన్న అమెరికా నేడు కరోనాతో కుప్పకూలిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్ష మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. మనదేశంలో కూడా రోజురోజుకీ మృతుల సంఖ్య.. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు అయోమయానికి గురవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగానే ఉంది... మరణాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ప్రజలు 'కరోనా' అనే పేరు వింటేనే భయపడిపోతున్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే విధించిన లాక్ డౌన్ మే నెల వరకు పొడిగించింది. అయితే కొంతమంది ఈ మహమ్మారి వలన కొన్ని ప్రయోజనాలు కూడా జరిగాయంటున్నారు. కరోనా వైరస్ విజృంభించడం వల్ల జనమంతా ఇంట్లోనే ఉంటున్నారు.. దీంతో ప్రకృతి స్వచ్చంగా మారిపోయింది. కలలో కూడా చూడని విధంగా నదులు, గాలి, నీరు అన్ని కాలుష్యరహితంగా మారిపోయాయి అంటున్నారు. అంతేకాకుండా ఈ కరోనా వచ్చి ఇంకెన్నో విషయాలలో మానవాళికి కనువిప్పును కలిగించాయంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు జగపతిబాబు సోషల్ మీడియాలో వినూత్నమైన పోస్ట్ పెట్టాడు.
కోట్లకు అధిపతి అయిన పోర్చుగల్ దేశంలోని శాంటాండర్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆంటోనియో పియారా కరోనాతో మృతి చెందడంపై అతని కూతురు రాసిన ఓ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 'మాకు ఎంతో సంపద ఉంది.. ఉచితంగా లభించే గాలి దొరక్క ఒంటరిగా మా తండ్రి చనిపోయాడు. కానీ మా సంపద మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది' అంటూ లేఖ రాసింది. పోర్చుగల్ కోటీశ్వరుడి ఘటనపై ఎమోషనల్ అయిన జగపతి బాబు.. 'అతను బతకాడిని అవసరమైన గాలిని ఆయనకున్న సంపద తీసుకురాలేకపోయింది. మనం జీవితాంతం నిర్విరామంగా పరిగెడుతూనే ఉన్నాం.. కానీ దేని కోసం.. ఇలాంటి భయంకరమైన, బాధాకరమైన చావు కోసమా.. సంపదతో ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఎప్పటికీ పోల్చలేము' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జగ్గూభాయ్ ట్వీట్ వైరల్ గా మారింది. నిజానికి ఎంత సంపాదించినా ఒక సూక్ష్మజీవి చేతిలో మనిషి ప్రాణం పోతున్నప్పుడు ఇంక మనిషి దేనికోసం ఆరాటపడుతున్నాడు. కరోనా వైరస్‌కు తారతమ్యాలు తెలియవు కదా. దానికి పేద, బీద, బలహీన వర్గం, సంపన్న వర్గం అంటే తెలియదు కదా. ప్రతి ఒక్కరి మీద తన ప్రభావాన్ని చూపిస్తూ వస్తోంది. అందుకే మనశ్శాంతితో ప్రశాంతమైన జీవితాన్ని గడపమని జగ్గూభాయ్ సూచిస్తున్నాడు.