Begin typing your search above and press return to search.

75 కోట్ల టీజర్లో వాయిస్ పెద్ద మైనస్

By:  Tupaki Desk   |   1 Aug 2016 12:17 PM GMT
75 కోట్ల టీజర్లో వాయిస్ పెద్ద మైనస్
X
అక్షరాలా బడ్జెట్ 75 కోట్లు.. అప్పుడు ఆ సినిమా లుక్‌ ఎలా ఉంటుంది? పెద్దగా రెమ్యూనరేషన్ల రూపంలో ఎవ్వరికీ ఇచ్చేదేం లేదు కాబట్టి.. ఖచ్చితంగా ప్రతీ రూపాయినా ఫ్రేములో కనిపించేలా చేయొచ్చు. దర్శకుడు మహదేవ్‌.. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కలసి ఇప్పుడు నిఖిల్‌ కుమార్ అనే కొత్త కుర్రాడిని అచ్చం అలాగే ఒక హాలీవుడ్ సినిమాలో ఇరికించారు. వుయ్ మీన్.. వీరు తీసిన ''జాగ్వార్'' అనే సినిమా హాలీవుడ్‌ యాక్షన్‌ ఫిలిం తరహాలోనే ఉంది.

తన కొడుకు నిఖిల్ ను ఎలాగైనా పెద్ద హీరోను చేయాలనే లక్ష్యంతో.. కర్ణాటక మాజీ మంత్రి కుమారస్వామి ఇప్పుడు 75 కోట్లతో ఈ సినిమాను తనే ప్రొడ్యూస్ చేశారు. ఆ ఖర్చంతా బాగానే కనిపిస్తోందిలే. అయితే ఈ సినిమా తెలుగు టీజర్లో మనం వినే డైలాగు మాత్రం ఎందుకో నాన్ సింక్ లో ఉన్నట్లు అనిపించక మానదు. అది హీరో గొంతా? లేకపోతే ఎవరైనా డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గొంతా? అనే విషయం ఎవ్వరికీ అర్ధం కావట్లేదు. ''నేనొక మొట్టు ఎక్కడానికి పదిమందికి మొక్కడానికైనా వంద మందిని తొక్కడానికైనా రెడీ'' అంటూ ఆ డైలాగ్ వింటుంటే.. ఇదేదో తెలుగు సరిగ్గా రాని చెన్నయ్ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టులు ఒక హాలీవుడ్‌ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి తీసుకొచ్చినట్లుంది.

అన్ని కోట్లు ఖర్చుపెట్టినప్పుడు.. అసలు మన వాయిస్ లో తెలుగు డిక్షన్‌ వర్కవుట్ అవుతుందా అని చెక్ చేసుకోవడానికి సదరు హీరోకు టైమ్ దొరకలేదంటారా? సినిమా అంతా ఇలాంటి ఫ్లాట్ వాయిస్ ఉంటే మాత్రం.. అది పెద్ద మైనస్ అయ్యే ఛాన్సుంది.