Begin typing your search above and press return to search.

అక్కడ దసరానే.. ఇక్కడే కుర్రాడి తీరిపోద్ది

By:  Tupaki Desk   |   1 Sept 2016 4:00 AM IST
అక్కడ దసరానే.. ఇక్కడే కుర్రాడి తీరిపోద్ది
X
జాగ్వార్.. కన్నడ సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న సినిమా ఇది. ఇందుకు కారణం లేకపోలేదు. ఓ కన్నడ సినిమాకి ఇది చాలా చాలా పెద్ద బడ్జెట్. ఇప్పటివరకూ కన్నడలో అత్యధికంగా వసూళ్లు సాధించిన మూవీ.. 2006లో వచ్చిన ముంగారు మాలే. 70లక్షల ఖర్చుతో రూపొందగా.. 75 కోట్ల వసూళ్లు సాధించింది ముంగారు మాలే. పదేళ్లు గడిచినా ఇంకా ఆ రికార్డుకు ఎవరూ చేరువ కాలేదు.

ఇప్పుడు ఏకంగా 75కోట్లు ఖర్చు చేసి జాగ్వార్ తీశారంటే.. కనీసం నూట పాతిక కోట్లయినా గ్రాస్ వసూలు చేయాలి. ఓ కన్నడ సినిమా ఇంత సాధించడం అసాధ్యం. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని ఆడియో రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా పిలిచారు. కుర్ర హీరో నిఖిల్ గౌడ ఎంతో కొంత తెలుగులో కూడా రాబడతాడని అనుకుంటే.. ఇప్పుడా సినిమా రిలీజ్ డేట్ ని అక్టోబర్ 6గా డిసైడ్ చేశారు.

దసరా సెలవలను క్యాష్ చేసుకోవడానికి ఇలా సెట్ చేశారని అనుకోవచ్చు. కానీ తెలుగులోకొచ్చేసరికి ఈ డేట్ అసలు సెట్ కాదు. అక్టోబర్ 7న రామ్ చరణ్ ధృవ వస్తుండడంతో.. జాగ్వార్ కి చుక్కలు కనిపించేయడం ఖాయం. దసరాకి అక్కడ పండగ చేసేసుకున్నా.. ఇక్కడ చెర్రీ చమక్కులతో సరదా తీరిపోవడం ఖాయం అంటున్నారు సినీ జనాలు.